కొంతకాలం క్రితం టి. సుబ్బిరామిరెడ్డి పవన్ కళ్యాణ్ చిరంజీవిల కాంబినేషన్ లో ఒక సినిమా తీస్తాను అని ప్రకటన ఇవ్వడంతో ఆ వార్త నిజం అయితే ఎంత బాగుండును అంటూ మెగా అభిమానులు ఎన్నో కలలు కన్నారు. కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాదు అలాంటి కోరిక రాజమౌళికి కూడ ఉన్నట్లు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది.


తనకు కూడ మెగా అభిమానులు లానే చిరంజీవి పవన్ లు ఒకే సినిమాలో నటిస్తే బాగుండును అన్నకోరిక ఉందని అయితే ఆకోరిక ఎప్పుడు తీరుతుందో తనకు తెలియకపోయినా ఆ కోరికతీరితే మాత్రం బాగుండును అన్న అభిప్రాయం తనకు ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. గతంలో ఒకసారి తనకు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిందని అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు అంటూ జక్కన్న కామెంట్స్ చేసాడు. 


పవన్ సినిమా రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాలలో పూర్తిగా మునిగిపోయిన పవన్ తో సినిమా చేయడం ఎంత గొప్ప దర్శకుడుకి అయినా కష్టం అని చెపుతూ సినిమాల పై పూర్తి శ్రద్ధ పవన్ కళ్యాణ్ పెట్టకుండా ఆయనతో  బ్లాక్ బాష్టర్ హిట్స్ తీయడం ఏ దర్శకుడుకైనా కత్తిమీద సాము లాంటిది అన్న తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఇదే సదర్భంలో పవన్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భావాలు ఎప్పుడు సమాజం చుట్టూ తిరుగుతూ ఉంటాయని ఒకవేళ తాను పవన్ తో సినిమా తీయవలసి వస్తే సందేశాత్మక చిత్రంగా అది ఉంటుంది అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేసాడు. 


ఇప్పుడు రాజమౌళి అభిప్రాయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఎప్పటి నుంచో పవన్ చిరంజీవిల కాంబినేషన్ కలపాలి అని నిజమైన ప్రయత్నాలు చేస్తూ సరైన దర్శకుడు లేక ఆగిపోతున్న సుబ్బిరామిరెడ్డి ప్రయత్నాలు ఈ కరోనా సమస్య ముగింపు తరువాత తిరిగి ప్రారంభం అయినా ఆశ్చర్యం లేదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: