టాలీవుడ్ లో హాస్య నటులకు ఎటువంటి కొరత లేదు. జబర్దస్త్, ఇంకా ఇతర షోల నుంచి అనేక మంది కమెడియన్స్ కొత్తగా పుట్టుకొచ్చారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది మాత్రమే కుదురుకున్నారని చెప్పవచ్చు. వారి పేర్ల విషయానికి వస్తే బ్రహ్మానందం, అలీ, సునీల్, శ్రీనివాస్ రెడ్డి... ఇలా కొద్ది మంది మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా హవా నడిచింది. ఇందులో సునీల్ కమెడియన్ చేసిన తర్వాత తను హీరోగా కొన్ని సినిమాలు చేసి తిరిగి మళ్లీ సపోర్టింగ్ రోల్స్ లో ఈ మధ్య కనిపిస్తున్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి కూడా హాస్య నటుడిగా నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.


అసలు విషయానికి వస్తే... హాస్యనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ గా కొనసాగుతూనే గత కొద్ది కాలంగా తన హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ మధ్య తను ప్రధాన పాత్రలో నటించి ఆ సినిమాకి దర్శకత్వం వహించారు శ్రీనివాస్ రెడ్డి. ఇక సినిమా విషయానికి వస్తే ఆ సినిమా పేరు "భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు" .ఈ సినిమా లాక్ డౌన్ ముందు విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అని చెప్పవచ్చు. శ్రీనివాస్ రెడ్డి కేవలం నటించడం, దర్శకత్వం వహించడమే కాకుండా ఈ సినిమాను కూడా ఆయనే నిర్మించాడట. తాను ఎంతగానో కష్టపడి ఓ సినిమా కథ రాసుకుని దాన్ని మంచిగా డెవలప్ చేసి స్క్రిప్టు నిర్మిస్తే ఆ సినిమా సరిగా ఆడలేక అప్పులపాలు అయ్యానని ఆయన వాపోయాడు.


తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమా స్క్రిప్ట్ నేను ఎంతో కష్టపడి ఇష్టపడి రాస్తున్నానని అందువల్లనే నిర్మించాలని ఆయన చెప్పుకొచ్చాడు. అంతేగాక ఆ సినిమాకి నేనే దర్శకత్వం కూడా వహించాను అని చెప్పాడు. ఇక అనుకున్నదే అన్నట్టుగా సినిమాను దర్శకత్వం వహించి నిర్మాణ పనులు చూసుకుని సినిమాను విడుదల చేశాడు. అయితే ఇంత కష్టపడ్డాం బూడిదలో పోసిన పన్నీరులా అతని ఫలితం మొత్తం చాలా నిరాశను మిగిల్చింది. ఈ సినిమాకు తాను చాలా డబ్బులు పోగొట్టుకున్నానని ఆయన తెలియజేశాడు. అయితే ఈ సినిమాకు గాను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకవైపు కొన్ని విమర్శలు వచ్చిన మరికొంతమంది ఏమో అనుభవం ఉన్న మంచి దర్శకుడులా తీశావు అని తనను మెచ్చుకున్నారని ఆయన తెలిపాడు. అయితే ఎన్ని ఏ విధంగా చేసిన కమెడియన్ గా ప్రస్తుతం అవకాశాలు తగ్గాయని చెబుతూనే తాను కమెడియన్ గా చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: