తమిళ చిత్ర పరిశ్రమలో ధనుష్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అయినా తన మామ పేరు అడ్డుపెట్టుకోకుండా స్వతహాగా తన ఓన్ టాలెంట్ తో సినిమాలను చేస్తూ.. ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ తనకంటూ సపరేట్ స్టైల్ ని ఏర్పరచుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తున్నారు ధనుష్. నటుడిగా.. నిర్మాతగా.. సింగర్ గా.. దర్శకుడిగా.. బహుముఖ ప్రగ్య కలిగిన ధనుష్ వరుస విజయాలతో అభిమానులను అలరిస్తున్నారు. 'రఘువరన్ బీటెక్'లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ధనుష్. 'మారి'లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. 'ధర్మయోగి'లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నారు. సినిమాలో పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకోవడంలో ధనుష్ ముందుంటారు.

 

అయితే ప్రస్తుతం హీరో ధనుష్ ప్లాన్ చేస్తోన్న కొత్త సినిమాల జాబితాలో ఆయన మామయ్య రజనీకాంత్ సినిమా కూడా ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. రజనీ 1981లో చేసిన సూపర్ హిట్ మూవీ ‘నెట్రి కాన్’ సినిమాను ధనుష్ ఇప్పుడు రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఎస్పీ.ముత్తురామన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రజనీ డబుల్ రోల్ చేశారు. కాగా ఈ రీమేక్లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. అపట్లో ఒరిజినల్ వెర్షన్లో నటించిన మేనక కీర్తి సురేష్ తల్లి కావడం విశేషం. ఇక ‘అసురన్, పటాస్’ ఇలా వరుసగా కొత్త కథలను ఎంచుకుంటున్న ధనుష్ ఇంకో రెండు కొత్త కథలను కూడా అంగీకరించాడట. వాటిలో మారి సెల్వరాజ్ సినిమా కథ కూడా కొత్తగా ఉంటుందట. అంతేకాకుండా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ‘జగమే తంత్రం’లో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. కరోనా తగ్గాక రజిని సినిమా రీమేక్ సెట్స్ మీదకు తీసుకువెళ్తాడట. ఈ రీమేక్ చిత్రానికి దర్శకుడు ఎవరు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: