లాక్ డౌన్ ఎఫెక్టుతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు వ్యాపారస్తులు ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. లాక్ డౌన్  సమయంలో రెండు మూడు రోజుల వరకు ఫ్యామిలీతో గడపడం  హాయిగా టీవీ చూడడం లాంటివి అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం రోజూ ఇంట్లో కూర్చుని బోర్ గా ఫీల్ అవుతున్నారు. కనీసం బయటికి వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో... ఇంటి నుంచి కాలు బయట పెడితే పోలీసులు కాస్త లాటి రుచి చూపిస్తుండడంతో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది ఎంతో బోర్ గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి బోరింగ్ టైం లో మనకు నచ్చిన హీరోలు సినిమాలు చూస్తే ఎంతో బాగుంటుంది. నచ్చిన హీరోలు సినిమాలు అంటే విడుదలైనప్పుడు చూసి ఉంటాం ఇక ఇప్పుడు ఎందుకు అంటారా.... విడుదలైనప్పుడు సినిమాలు చూసినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయాయి. 

 

 

 అలా నాచురల్ స్టార్ నాని నటించిన సినిమాల్లో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి అష్టా చమ్మా. నాని హీరోగా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైన సినిమా అష్టాచమ్మా. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. మొదటి సినిమా అయినప్పటికీ నాని నటనకు ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఈ సినిమాలో పల్లెటూరి అబ్బాయి గా ఉన్న నాని  సిటీ లైఫ్ కోసం తహ తహ లాడుతూ ఉంటాడు. దీంతో నాని ప్రస్టేషన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది . 

 

 

 అంతేకాకుండా ఈ సినిమాలో నాని కి జోడిగా నటించిన కలర్స్ స్వాతి... మహేష్ మహేష్ అంటూ హీరో మహేష్ బాబు జపం చేస్తూ ఉండటం కూడా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన సినిమా ఈగ. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన విధానం ఎన్నిసార్లు చూసినా ఆశ్చర్యపరుస్తునే ఉంటుంది. నాని నటించిన సినిమాల్లో  ఎప్పుడు బోర్ కొట్టని సినిమా నిన్ను కోరి. ఈ సినిమా చూస్తున్నంత సేపు... నాని పాత్రలో ప్రతి ప్రేక్షకుడు తనని తాను ఊహించుకుంటూ లవ్ ఫీల్  లోకి వెళ్లి పోతాడు అంతలా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఇక నాని నటించిన పిల్ల జమిందార్ సినిమా కూడా... యూత్ కి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటుంది ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అందుకే లాక్ డౌన్  సమయంలో నాని హీరోగా నటించిన ఈ సినిమాలు  చూసి తెగ ఎంజాయ్ చేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: