తెలుగు సినిమాల్లో పాటలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అందరికీ తెలిసిందే. మనవాళ్లకి సినిమాని కథలా చెప్పుకుంటూ వెళ్తుంటే నచ్చదు. ఖచ్చితంగా అందులో పాటలు ఉండాల్సిందే. పాటలు లేకుండా సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉండవచ్చు. కానీ పాటల వల్లనే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు అనేకం. అందుకే మన సినిమాల్లో పాటలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ మధ్య వచ్చే పాటల్లో ఇతరభాషల పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

మనం సాధారణంగా మాట్లాడే వాడుక భాషలో అప్పుడప్పుడు ఇతర భాషల పదాలు వాడినట్టుగానే పాటల్లోనూ వాడేస్తున్నారు. అయితే అందులో తప్పులేదు కూడా. కానీ ఇతరభాషల పదాలు ఎక్కువై డామినేట్ చేసినపుడే పాటలోని కమ్మదనం పోతుంది. రెండూ మిక్స్ చేసేసరికి శబ్దంలో ఉండే ప్యూరిటీ కల్మషం అవుతుంది. అయితే ఒకే భాషా పదాలు ఉన్న పాటకి, వివిధ భాషల పదాలు కలగలిపిన పాటకి తేడా గమనించవచ్చు.

 

అయితే ఇదంతా పక్కన పెడితే ఒక తెలుగు సినిమాలో పూర్తి హిందీలో పాట పెడతారని అప్పడి వరకూ ఎవరూ ఊహించి ఉండరు. అలా ఎవరూ అనుకోని ఊహని నిజం చేసి చూపించాడు పవన్ కళ్యాణ్. ఖుషీ సినిమాలో యే మేరా జగాహ్ యే మేరా ఘర్, మేరా ఆసియా అనే పాట పూర్తి హిందీ సాహిత్యంతో సాగుతుంది. అయితే ఇదేమీ కావాలని ఇరికించి పెట్టింది కాదు. కథా ప్రకారం హీరో కలకత్తాలో నివసిస్తుంటాడు.

 

అందుకని అక్కడి జనాల్లో కలిసి పాడుకునే పాట కాబట్టి అలా చేశారు. అప్పట్లో ఆ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు సినిమాలో హిందీ పాట వినేసరికి అందరూ షాక్ అయ్యారు. హిందీ తెలియనివారి నోట కూడా హిందీ పాట పాడించిన ఘనత పవన్ కళ్యాణ్ కే చెల్లుతుంది. ఎస్ జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: