ఏంటి లాక్ డౌన్  సమయంలో బోర్ కొడుతుందా... రెండు మూడు రోజుల వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఇంట్లో కూర్చోవడం కష్టంగా మారిందా ... ఏం చేయాలో పాలుపోవడం లేద. ఇంకెందుకు ఆలస్యం మీ అభిమాన హీరోల సినిమాలు చూసి ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేయండి. మళ్లీ ఎప్పటికీ ఇలాంటి సమయం వస్తుందో తెలియదు కాబట్టి. మీకు నచ్చిన హీరోల సినిమాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలో మరోసారి హాయిగా సోఫాలో కూర్చుని....హాయిగా  పాప్కాన్ తింటూ... ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ చూసేయండి. ఇలాంటి సమయంలో మెగాపవర్ స్టార్ రామ్  చరణ్ హీరోగా నటించిన సినిమాల్లో లాక్ డౌన్ లో  చూడాల్సిన సినిమా లేవో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

 

 

 మన అభిమాన హీరోల సినిమాలు ఎన్ని వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. మళ్లీ అప్పుడే కొత్తగా సినిమా చూస్తున్నామా  అనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. అందుకే అలాంటి సినిమాలు ఎన్ని సార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. ఇలాంటి సినిమాలలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అని చెప్పాలి. ఒక్కసారిగా రామ్చరణ్ కు  స్టార్డమ్ పెంచేసింది. ఈ సినిమాలు ప్రస్తుతం జనరేషన్ కి సంబంధించిన కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్థాయి... గతంలో వీరిద్దరూ  ప్రేమించడం... కాజల్ అగర్వాల్ కోసం రామ్ చరణ్ చేసే యుద్ధ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.

 

 

 ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చెప్పే డైలాగులు అయితే ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పెంచుతుంది. ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్తో కడుపుబ్బా నవ్విస్తుంది బ్రూస్ లీ సినిమా. ఈ సినిమాలో స్టెంట్ మెన్  గా నటించే రామ్ చరణ్ తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ధ్రువ సినిమా కూడా లాక్ డౌన్  సమయంలో మంచి ఎంటర్టైన్మెంట్ పెంచుతుంది అని చెప్పాలి. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు రామ్ చరణ్. ఆ తర్వాత రంగస్థలం. ఈ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఎన్నిసార్లు చూసినా అదే అనుభూతి. పల్లెటూరు నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.

మరింత సమాచారం తెలుసుకోండి: