రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ ఈ చిత్రం మరోసారి కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడనుంది. ఇప్పటికే డెభ్బై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇంకా ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించాల్సి ఉంది.

 

 

ఇప్పటి వరకు ప్రతినాయకులు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. అలాగే హీరోయిన్స్ పై చిత్రీకరణ జరగలేదు. అందువల్ల చాలా కీలక సన్నివేశాలే మిగిలి ఉన్నాయని అంటున్నారు. హీరోలు ప్రతినాయకులపై తిరగబడే సన్ని వేశాలు వాళ్ళు వస్తేకానీ చిత్రీకరించలేరు. ప్రతినాయకులుగా విదేశీ నటులని తీసుకున్న రాజమౌళి.. వారిని ఇప్పట్లో తీసుకురావడం కష్టమే. కరోనా వల్ల విదేశీ ప్రయాణాలు ఇప్పట్లో కుదరకపోవచ్చు.

 

 

అందువల్ల వీరితో చిత్రీకరణ జరిగ్పి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుని సినిమాని రిలీజ్ చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. అందుకే ఈ సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రాజమౌళి కూడా ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. లాక్దౌన్ మొదట్లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ వాయిదా పడదని చెప్పినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే వాయిదా పడక తప్పదేమో అనిపిస్తుంది.

 

 

 

రాజమౌళి కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు. ఎత్తేసినా షూటింగ్ కి అనుమతినిస్తారా.. రాజమౌళి వంటి భారీ సినిమాకి చాలా మంది పనిచేయాల్సి ఉంటుంది. మరి అంతమందిని షూటింగ్ కి అనుమతినిస్తారా అన్న సందేహాలున్న సమయంలో రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కానీ ఏ విషయం క్లారిటీ రాదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: