మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వరుణ్ తేజ్ కు మంచి హిట్ సాధించింది అనే చెప్పాలి. ఆ తర్వాత "లోఫర్" సినిమా విడుదల అయ్యింది. అప్పటిలో ఈ సినిమాలో అమ్మకి సంబంధించిన ఒక పాట ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి "ఫిదా" తీశారు. ఈ సినిమా యువకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కూడా ప్రేమ కథ చిత్రంగా నిలిచింది అనే చెప్పాలి. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన తన బాబాయ్ నటించిన తొలిప్రేమ సినిమా పేరుని పెట్టి కొత్త సినిమాని తీసాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.

 

 

ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి మల్టీస్టారర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాలో కామెడీతో తన దైన రీతిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మొత్తం కామెడీతో ప్రేక్షకులను అల్లారించారు ఇద్దరు హీరోలు. ఆ తర్వాత ఒక ప్రత్యేక పాత్రలో ఎప్పుడు నటించని విధంగా గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నిజానికి ఈ సినిమా రిలీజ్ వరకు తన వాల్మీకి గా ప్రచారం జరిగింది. కానీ కొన్ని సంఘాల వారు అభ్యంతరం చెప్పడంతో కేవలం ఒక్క రోజుకు ముందు సినిమా పేరు మర్చి రిలీజ్ చేసారు. అంతే కాకుండా వరుణ్ తేజ్ కూడా ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేసి మంచి ఆరాధన దక్కించుకున్నాడు అనే చెప్పాలి. ఈ సినిమా వరుణ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది. తండ్రికి తగ్గ కొడుకు అని కూడా వరుణ్ నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: