అవును.. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మారే హీరోకి ఉండదు ఏమో.. నిజంగానే అతనికి అంత క్రేజ్ ఎందుకో ? మనం అనుకుంటాం కానీ.. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఎక్కువ అండి.. ఎందుకో మరి ఆయన అంటే పడి చచ్చిపోతారు.. అయన పేరు వింటే చాలు.. అయన స్టైల్ గుర్తొచ్చి చెయ్యి మెడ వెనక్కి వెళ్ళిపోతుంది.. గబ్బర్ సింగ్ మ్యూజిక్ వస్తుంది.. 

 

అయినా ఇది మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాలు అయినా తీసిన ప్రతి సినిమా అట్టర్ ప్లాప్.. నిజం చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ తో సినిమా తియ్యాలి అంటే డైరెక్టర్లు, నిర్మాతలు వణికిపోయేవారు.. అంత ఘోరంగా ప్లాప్ లు వచ్చాయి పవన్ కళ్యాణ్ కి.. 

 

అయితే నిజానికి పవన్ కళ్యాణ్ అతి వృష్టి అనావృష్టి లెండి.. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ప్రారంభంలో ఏడు సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా సినిమాలు అన్ని వరుసగా హిట్ వచ్చాయి.. 

 

ఆతర్వాత ప్లాప్ లు మొదలయ్యాయి.. జాన్నీ వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అవ్వడం.. ఏకంగా పది సంవత్సరాలు తీసిన సినిమాలు అన్ని ప్లాప్ లు అవ్వడం జరిగింది.. పదేళ్ల తర్వాత గబ్బర్ సింగ్ అంటూ వచ్చాడు.. హిట్ కొట్టాడు.. అంతే.. అంతవరుకు బాధ పడుతున్న పవన్ ఫాన్స్ ఒక్కసారిగా ఎగిరి గంతేస్తున్నారు. 

 

పదేళ్లు ప్లాప్ హిస్టరీ అంటే ఇంకా ఆ హీరో .. హీరో కాదు అని అర్ధం.. ఫాన్స్ లేరు అని అర్ధం.. కానీ పవన్ కి మాత్రం.. ఆ స్టైల్ కి.. ఆ డాన్స్ కి అంత క్రేజ్.. ఏమాత్రం ఆయనపై ప్రేమ తగ్గలేదు.. పవన్ కళ్యాణ్ అంటే చాలు.. మా క్రేజీ హీరో అంటూ అరుపులు.. కేకలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: