టాలీవుడ్  లో ఎన్నో సినిమాలు మాఫియా నేపథ్యంలో వచ్చాయి.  కొన్ని సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  ఒకప్పుడు మాఫియా తరహా సినిమాలు తీయడంలో రాం గోపాల్ వర్మ పెట్టింది పేరు అనే వారు.  ఆ తర్వాత ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ ఈ తరహా సినిమాలు బాగానే తీశారు.  టెంపర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ కి ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు.  మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరిగా గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’ తో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు.  అప్పటి వరకు ఓ సూపర్ హిట్ కోసం తెగ ఎదురు చూస్తున్న రామ్ పోతినేనికి ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి బూస్టింగ్ ఇచ్చింది.  ప్రస్తుతం పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతుంది.  

 

ఈ మూవీలో విజయ్ దేవరకొండఫైటర్ గా కనిపించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. దాంతో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉంటుంది? ఆయన ఎలా కనిపిస్తాడు? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ మూవీ మాఫియా నేపథ్యలో సాగుతుందని అంటున్నారు.  అందుకే ఎక్కువగా ముంబాయి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ఎక్కువగా జరుగుతుంది.

 

ఈ సినిమాలో ఆయన ఓ మాఫియా డాన్ కి కొడుకుగా కనిపిస్తాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొంతసేపు అలా కనిపించే ఆయన, ఆ తరువాత మాఫియాకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడని అంటున్నారు. విజయ్ దేవరకొండపై డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్, ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేసేలా వుంటాయని అంటున్నారు. ఈ తరహా సినిమాలు పూరిగా బాగా కలిసి వస్తాయి.. మరి విజయ్ దేవరకొండకు మంచి హిట్ పడుతుందా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: