ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయినప్పటికీ  లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డోన్ కారణంగా సినిమా షూటింగ్ లన్ని రద్దయ్యాయి. దీంతో అందరూ ఇంటి పట్టునే ఉండి కాలక్షేపం కొరకు ఏదో ఒకటి చేస్తున్నారు.

 

 

 

కొందరు  జిమ్ కు వెళ్లి  ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటే మరికొందరు ఇంట్లోనే ఉంటూ తమ ఆడవారికి ఇంటి పనుల్లో సహాయపడుతున్నారు. ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి రాజమౌళికి''ఈ కష్టకాలంలో ఇంట్లో  పనిమనుషులు లేకపోవడంతో ఇంట్లో ఆడవారికి పనుల్లో తోడుగా ఉంటూ సాయం చేసిన డే మగాడు  అంటూ'' ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఆ చాలెంజర్ స్వీకరించి మరో వీడియోను తయారుచేసి ఆ వీడియో ముఖంగా రామ్ చరణ్ కు జూనియర్ ఎన్టీఆర్ కు  చాలెంజ్ విసిరాడు.

 

అందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోనే ఉంటూ గిన్నెల కడుగుతూ మరియు ప్లోర్ తుడుస్తూ , చెత్తను ఊడుస్తూ చేసిన  వీడియోను తయారుచేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో   పోస్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవికి చాలెంజ్ విసురుతూ .. ట్యాగ్ చేశాడు.... వీరితో పాటు బాలకృష్ణకు, నాగార్జునకు, వెంకటేష్  కు మరియు శివా కొరటాలకు కూడా ట్యాగ్ చేశాడు....

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: