పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్న సమయంలో సీనియర్ డైరక్టర్ కె. మురళీమోహన్ రావు ఓ మాట చెప్పారట. ‘జీవితంలో డబ్బు సంపాదిస్తే మాత్రం జాగ్రత్తగా ఖర్చెపెట్టు. డబ్బును జాగ్రత్త చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరినీ నమ్మొద్దు’ అని చెప్పారట. కానీ.. పూరి ఆ మాటలు పట్టించుకోలేదట. నిజంగా నమ్మినవాళ్ల దగ్గర డబ్బు పోగొట్టుకున్నాక పూరికి మురళీమోహన్ రావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయట. ఈ విషయాన్ని మురళీమోహన్ రావుతో పంచుకున్నాడట. విశేషమేమంటే.. ఈ మాటలు చెప్పినట్టు మురళీమోహన్ రావుకు గుర్తు లేదట.

 

 

మెగాస్టార్ చిరంజీవితో కొదమసింహం తీసిన దర్శకుడే కె.మురళీమోహన్ రావు. ఎన్నో పుస్తకాలు చదివి జ్ఞానం పొందిన పూరి మనిషిని అంచనా వేయడంలో మాత్రం వెనుకబడిపోయాడు. తాను నమ్మిన వాళ్లే మోసం చేశారు. సినిమాలతో బిజీ అయిపోయి సంపాదించిన ఆస్తిని పోగొట్టుకున్నాడు. పూరి కష్టం, తెలివితేటలకు అదృష్టం తోడై మళ్లీ ఉన్నత స్థితికి తీసుకెళ్లాయి. తన బిజినెస్ మేన్ సినిమాలో మనిషి తత్వం గురించి మాత్రమే కొన్ని డైలాగులు రాశాడు పూరి. ‘మనిషి మాట అసలు వినొద్దు, మనిషిని నమ్మొద్దు..’ అనే డైలాగులు స్వానుభవంతో రాశాడు. ఈ డైలాగులు ఆ సినిమాలో బాగా పేలాయి.

 

 

జీవితంలో సాయం పొందాలన్నా, సాయం చేయాలన్నా అది మనుషుల మధ్యే సాధ్యం. నమ్మకద్రోహం అంటే.. నమ్మిన వాళ్లకు ద్రోహం చేయడమే అనే మాట కూడా ఉంది. వీటన్నింటికి ఉదాహరణగా నిలిచిపోయాడు టాలీవుడ్ ఏస్ డైరక్టర్ పూరి జగన్నాధ్. జీవితంలో ఎదిగేందుకు ఎంత కష్టపడ్డాడో సంపాదించేందుకు అంతగా కష్టపడలేదు పూరి. తన టాలెంట్ కు డబ్బే తన వద్దకు వచ్చేసింది. ఓ దశలో డైరక్టర్ గా పూరి జగన్నాధ్ సంపాదించిన డబ్బును ఈ జనరేషన్ లో మరే దర్శకుడు కూడా సంపాదించలేదంటే అతిశయోక్తి కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: