ఈ మద్య రిమేక్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఒక సినిమా హిట్ అయితే వెంటనే ఆ మూవీ ఇతర భాషల్లో రిమేక్ చేస్తున్నారు.  కొన్ని సూపర్ హిట్ అవుతున్నా.. మరికొన్ని ఫ్లాప్ అవుతున్నాయి.  తెలుగులో హిట్ అయిన మూవీలు బాలీవుడ్, కోలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మూవీస్ తెలుగు లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రజినీకాంత్ నటించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి. గత ఏడాది మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్భార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 

 ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా రజినీకాంత్ నటిస్తున్నారు. ఆయన అల్లుడు ధనుష్ హీరో మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. నటుడుగానే కాకుండా సింగర్, నిర్మాతగా కొనసాగుతున్నారు.  తమిళనాట కొత్తదనం కలిగిన కథలకు ప్రాధాన్యతనిచ్చే కథానాయకులలో ధనుశ్ ముందువరుసలో కనిపిస్తాడు. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. గతంలో రజనీ చేసిన సూపర్ హిట్ మూవీని రీమేక్ చేసే ఆలోచనలో వున్నట్టుగా కొన్ని రోజుల క్రితం వార్తలు షికారు చేశాయి.  

 

కాకపోతే ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో దీని గురించి పెద్దగా ఫోకస్ కాలేదు. కాకపోతే ధనుష్ ఇంటిపట్టున ఉంటూ.. తన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి అవసరమైన కసరత్తు మొదలెట్టాడని అంటున్నారు. 1981లో రజనీ చేసిన 'నెట్రి క్కాన్' భారీ విజయాన్ని సాధించింది. రజనీ ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమాలో మేనక కథానాయికగా నటించింది. ఇప్పుడు ఆ సినిమానే ధనుశ్ రీమేక్ చేయాలనుకుంటున్నాడు.  ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: