ఆరేళ్ల చిన్న పిల్లల నుంచి అరవై ఏళ్ల వయసున్న వారిని ఎంటర్ టైన్ చేసే హీరో చిరంజీవి అని పేరు. ఫ్యామిలీ మొత్తం కలిసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది చిరంజీవి సినిమాలకే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న ప్రజలకు సినిమాలే వినోద సాధనాలయ్యాయి. వీరిలో చిరంజీవి సినిమాలను చూసి ఎంజాయ్ చేసే వారు ఉన్నారు. చిరంజీవి ఎంటర్ టైన్ చేసే మూవీస్ లో టాప్ 5 ను సెలక్ట్ చేయడం కష్టమైన విషయమే. కానీ చిరంజీవి ఒన్ మ్యాన్ షో చేసిన సినిమాల లిస్టులో కొన్ని ఇవే.

IHG

 

ఖైదీ, పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, స్వయంకృషి సినిమాలను ఒక్కో కేటగిరీలో స్పెషల్ గా చెప్పుకోవాలి. ఖైదీ సినిమాతో ఒరిజినల్ ఫైట్స్, యాక్షన్ లో గ్రేస్ చూపించి ట్రెండ్ సెట్ చేశాడు. అప్పటినుంచి చిరంజీవి కెరీరే మారిపోయింది. పసివాడి ప్రాణంతో చిరంజీవి మరో ఎత్తుకు ఎదిగారు. మూగ, చెవిటితో ఉన్న చిన్న పిల్లాడి ప్రాణాలు కాపాడే పాత్రలో చిరంజీవి ఆకట్టుకున్నారు. ఆ సినిమాతోనే బ్రేక్ డ్యాన్స్ లను పరిచయం చేసి అశేష ప్రేక్షకాభిమానులను సంపాదించుకన్నారు. చిన్న పిల్లలందరూ ఆయన ఫ్యాన్స్ గా మారిపోయి తర్వాత రోజుల్లో వారే మెగా ఫ్యాన్స్ అయిపోయారు.

IHG

 

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో సామాన్యుడిగా, దేవలోకం నుంచి వచ్చిన దేవకన్యతో చిరంజీవి చేసే సరదాలు ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. గ్యాంగ్ లీడర్ చిరంజీవి కెరీర్లో కలికితురాయి. మాస్ హీరోగా ఎవరెస్ట్ అంత ఎత్తులో కూర్చోబెట్టి తిరుగులేని నెంబర్ వన్ హీరోగా నిలిపింది. చిరంజీవిలోని నటనను పూర్తిగా ఆవిష్కరించిన సినిమాల్లో స్వయంకృషికి ప్రత్యేక స్థానం ఉంటుంది. జీరో నుంచి హీరో కావడం ఎలానో చూపించే ఈ కథ ప్రతి వ్యక్తి మనసుకు దగ్గరవుతుంది. చిరంజీవి నటన మనసుకి హత్తుకుంటుంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: