మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో మరో మెయిన్ రోల్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. వచ్చే సంక్రాంతికి జక్కన్న సినిమాని రిలీజ్ చేస్తానన్నాడు కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా వచ్చే మార్చి కి సినిమా రిలీజ్ అవుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 

 సినీ తారలు ఇంట్లో ఉంటూ ప్రజలను చైతన్యపరిచే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి రాజమౌళికి'' ఈ కష్టకాలంలో ఇంట్లో పని మనుషులు లేకపోవడంతో ఇంట్లో ఆడ వారి పనుల్లో తోడుగా ఉంటూ సాయం చేసే వాడే మగా'' అంటూ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసినదే. ఆ చాలెంజ్ని  రాజమౌళి స్వీకరించి ఇంట్లో పనులు చేస్తున్నట్లు  తన భార్యకు సహాయం చేస్తున్నట్లు వీడియో  చేశాడు. ఆ వీడియో ద్వారా రామ్ చరణ్ కు రాజమౌళి చాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ లో భాగంగా రామ్ చరణ్ తన ఇంట్లో బట్టలు ఉతుకుతూ మరియు ఇంట్లో చెత్త  అంతా ఊడుస్తూ మరియు తన భార్యకు టీ పెట్టి ఇస్తూ ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ కి, రన్బీర్ కపూర్ కి, రానా దగ్గుబాటి కి మరియు శర్వానంద్  తదితరులకు చాలెంజ్ విసిరాడు...చరణ్ 

మరింత సమాచారం తెలుసుకోండి: