రష్మిక మహేష్ బాబు వెంటపడి సరిలేరు నీకెవ్వరులో గోల గోల చేసింది. మహేష్ పట్టించుకోకపోయినా అదే పనిగా  టీజ్ చేస్తూ యూత్ కి గిలిగింతలు పెట్టింది. గీతా గోవిందంలో హీరోను తన వెంట తిప్పించుకున్న ఈ ముద్దు గుమ్మ మహేష్ లాంటి సూపర్ స్టార్ వెంటపడి అల్లరి చేసింది.

 

అల్లరి బాగా నచ్చేసింది కూడా. అందుకే సినిమా బాగా సూపర్ డూపర్  హిట్ అయింది. ఇక ఆ తరువాత రష్మిక దశ మారుతోంది. జూనియర్ ఎన్టీయార్ త్రివిక్రం మూవీలో కూడా తీసుకుంటారని ఓ వైపు టాక్ నడుస్తోంది. మరో వైపు చూసుకుటే బన్నీ సరసంగా జత కడుతోంది.

 

ఇది నిజంగా చాలా ఇంప్రూవ్మెంటే. బన్నీ సొంత సంస్థలో గీతా గోవిందం చేసి రెండేళ్ళు తిరగకుండానే బన్నీవంటి స్టార్ పక్కన చాన్స్ కొట్టేసిందంటే గీత రాత గొప్పదేననుకోవాలి. 

 

ఇక బన్నీ పుష్పగా పక్కా మాస్ రోల్ వేస్తుంటే ఆయన సరసన చిత్తూరు యాస మాట్లాడే కూలీగా రష్మిక కనిపిస్తోంది. మరి పూర్తిగా డీ గ్లామరైజ్ రోల్ ఇది.రష్మిక ఎలా పండిస్తుందో చూడాలి.

 

అయితే ఈ మూవీ గురించి రష్మిక కొన్ని కొత్త విషయాలను గమ్మత్తుగా చెబుతోంది. తాను ఈ మూవీలో కొత్తగా కనిపిస్తానను అంటోంది. అంతే కాదు తనలోని కొత్త కోణాన్ని ఆడియన్స్ అంతా చూస్తారని కూడా అంటోంది.

 

తనకు చాలా తొందరగానే ఇలాంటి రోల్ రావడం గ్రేట్ అంటోంది. తనకు ఇచ్చిన ఈ పాత్రను పండించి ప్రూవ్ చేసుకుంటానని కూడా చెబుతోంది. మరి రష్మిక నోటి వెంట కొత్త కోణం వంటి మాటను విన్నవారు మాత్రం  వామ్మో  ఈ మూవీలో రష్మిక ఏం చూపిస్తుందో అని అపుడే నోళ్ళు ఊరిస్తున్నారుట. ఇక రష్మికదే తరువాయి మరి కోసం అంతా వెయిటింగ్

మరింత సమాచారం తెలుసుకోండి: