ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అందులోనూ ఇప్పుడు కరోనా టెస్టుల సంఖ్య పెరగడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువయ్యాయి. మన దేశం లో కూడా   కరోనా ఎలా విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెసిందే.  మే 3 వరకు లాక్ డౌన్ పొడగించారు.  మొన్న తెలంగాణ 


 
ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ మే 7 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇదే నిర్ణయం దేశం లో అందరూ తీసుకోవాలి అంటూ డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే . కరోనా లాక్ డౌన్ ప్రపంచం లో ఎవ్వరికీ తప్పడం లేదు. మహా మహులే సైలెంట్ అయిపోయారు. బాలీవుడ్ నటుడు , దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఈ లాక్ డౌన్ దెబ్బకి తల్లడిల్లి పోయాడు. ఒక మారు మూల గ్రామం లో ఉండిపోయాను అనీ అక్కడ ఇంటర్నెట్ సౌకర్యామే లేదు అంటూ చెప్పుకొచ్చాడు. "ఒకవేళ నేను అనారోగ్యానికి గురైతే వైద్య సాయం కోసం 12 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చాలా విపత్కర పరిస్థితులలో ఉన్నాం. నా ఫోన్‌లో అడపాదడపా వచ్చే వార్తలని చూస్తుంటే బాధగా ఉంది. " అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు శేఖర్ . మిస్టర్ ఇండియా లాంటి గొప్ప సినిమా లు తీశాడు ఈయన.

 

భారత ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, గడచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో 1,336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 47 మంది ఒక్క రోజులో మరణించారు. భారత్‌ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతూనే ఉన్నాయి..  ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలా అని తల్లడిల్లిపోతోంది భారత దేశ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: