లాక్ డౌన్ టైంలో ఒక్కొక్కరు ఒక్కోలా తమ టైంను గడుపుతున్నారు. కొందరైతే వర్క్ చేయడం చేయకపోవడం పక్కన పెడితే ఇదివరకు చూసిన సినిమాలనే మళ్ళీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ లాక్ డౌన్ టైం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడాలనుకునే ఆయన టాప్ 5 సినిమాలేవో ఇప్పుడు చూద్దాం. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైనా అల్లు అర్జున్సినిమా హిట్టు కొట్టినా అది తన లెక్కలోకి రాదని చెప్పాలి. ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్య సినిమా అల్లు అర్జున్ లోని అసలు టాలెంట్ ను బయట పెట్టింది. సుకుమార్ కి అది మొదటి సినిమానే అయినా సరే బాగా హ్యాండిల్ చేశాడు. 

 

ఇక ఆర్య తర్వాత బన్నీ లోని ఎనర్జీని, మాస్ పల్స్ ను పట్టేసిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయా డైరక్షన్ లో తెరకెక్కిన దేశముదురు సినిమా కూడా హిట్ అందుకుంది. ఈ సినిమాను కూడా ఫ్యాన్స్ భలే ఎంజాయ్ చేస్తారు. ఇక ఇదే టైం లో బొమ్మరిల్లు భాస్కర్ సెకండ్ ప్రాజెక్ట్ పరుగు కూడా చూసే అవకాశం ఉంటుంది. దిల్ రాజు బ్యానర్ లో కొత్త కథతో ఎమోషనల్ జర్నీగా ఈ సినిమా సాగుతుందో. పరుగు కూడా లాక్ డౌన్ టైం లో చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ మొదటిసారి కలిసి చేసిన సినిమా జులాయి. ఈ సినిమాలో బన్నీ చాలా క్లవర్ గా కనిపిస్తాడు. సినిమాతో ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యారు.  

 

ఇక బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన సరైనోడు సినిమా కూడా అల్లు అర్జున్ కు మంచి హిట్ అందించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఫుల్ లెంగ్త్ మాస్ హీరోగా మాస్ ఫాలోయింగ్ కూడా ఏర్పరచుకున్నాడు. ఇవే కాదు బన్నీ నటించిన ఆర్య-2, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం,లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురములో కూడా ఈ లాక్ డౌన్ టైం లో చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: