టాలీవుడ్ లోకి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బెంగుళూరు స్వీటి అనుష్క. స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క తన ఫిట్ నెస్ విషయంలో ఎంతో శ్రద్ద వహించేది. దాంతో తన ఫిజిక్ ఏ హీరోకైనా ఇట్టే సెట్ అయ్యేది.. అందుకే వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.  కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’ మూవీ తర్వాత అనుష్క గ్లామర్ పాత్రలకు గుడ్ బాయ్ చెప్పి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో రుద్రమదేవి, సైజ్ జీర్, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనటించి మెప్పించింది.  

 

ఇక బాహుబలి లో డీ గ్లామర్ గా కనిపించి... బాహుబలి 2 లో అందాల రాశిగా కనిపించింది. భాగమతి తర్వాత చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్నమూవీ ‘నిశ్శబ్దం’. క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌లో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. వాస్తవానికి ఈ మూవీ ఏప్రిల్ 2 న విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా వైరస్ భారత దేశంలో ఎఫెక్ట్ చూపిస్తుందని లాక్ డౌన్ ప్రకటించారు.

 

దాంతో థియేటర్లు, మాల్స్ క్లోజ్ చేశారు. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పడం కష్టం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా విడుదల కాబోతోందంటూ వస్తున్న వార్తలకు చిత్రయూనిట్ చెక్ పెట్టింది. అలాంటి వార్తలు నమ్మవద్దంటూ అధికారికంగా తెలియజేసింది. కాగా, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: