సమంత.. నిజంగా ఈ పేరులోనే ఏదో మత్తు ఉంది అబ్బా.. ఈమె మొదటి సినిమాలో అందంగా ఎం లేదు.. కానీ పర్లేదు అనిపించుకుంది.. ఆ తర్వాత ఒకటికొకటి మంచి మంచి సినిమాలు చేసి.. టాప్ హీరోల వద్ద నటించి మంచి మార్కులు కొట్టేసింది.. అందుకే సమంత అంటే అభిమానులకు ఎంతో ఇష్టం.. ఇంకా సమంత సినిమాలు చూస్తే చాలు.. అలా సమయం గడిచిపోతుంది అంతే. అయితే సమంత నటించిన టాప్ 5 సినిమాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

టాప్ 5 సమంత సినిమా.. ఏమాయ చేసావే..  

 

సమంత మొదటి సినిమా ఇది.. జెస్సిగా కనిపించి అందరి మనసులు దొంచింది సమంత.. ఈ సినిమాలో మాములు అమ్మాయిల నటించినప్పటి.. ఈమె గొంతుకు అభిమానులు ఎక్కువ అయిపోయారు.. ఈ సినిమా చాలా స్లోగా మూవ్ అవుతుంది.. గౌతమ్ మీనన్ సినిమాలు అంటేనే అంతే కదా! ఈ సినిమా మంచి జోష్ అందిస్తుంది అంటే నమ్మండి.. 

 

టాప్ 4 సమంత సినిమా.. ఈగ..  

 

సమంత అప్పటి వరుకు మాములు హీరోయిన్.. కానీ ఈ సినిమాలో మాత్రం సమంత అందాన్ని ఎంతో అందంగా చూపించాడు రాజమౌళి.. ఈ సినిమాలో సమంతని చూస్తే ఎవరైనా సరే ఫ్యాన్స్ అయిపోతారు అంతే.. అంత అద్భుతంగా ఉంది ఈ చిత్రం. 

 

టాప్ 3 సమంత సినిమా.. మజిలీ.. 

 

నిజంగా.. ఈ సినిమా చూస్తే ప్రతి అబ్బాయికి అనిపిస్తుంది.. ఇలాంటి భార్య ఉండాలి అని.. భర్త ఇంకో అమ్మాయిని ప్రేమించాడు అని తెలిసిన.. తాగుబోతు అని తెలిసిన.. కోపిష్టి అని తెలిసిన సరే భర్తను ఎంతో జాగ్రత్త చూసుకుంటూ ఎంతో ప్రేమను పంచుతుంది.. ఈ సినిమా నిజంగా ఓ అద్భుతమే.. సమంత యాక్టింగ్ అదుర్స్. 

 

టాప్ 2 సమంత సినిమా.. అ ఆ.. 

 

ఈ సినిమాలో సమంత యాక్టింగ్ పిక్స్.. అసలు ఏమి తెలియనట్టు యాక్టింగ్ ఇంకా అదుర్స్.. ఎంతో అద్భుతమైన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.. ఈ సినిమాలో డైలాగ్స్ అబ్బో.. ఎంత బాగుంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి అద్భుత చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూడచ్చు. 

 

టాప్ 1 సమంత సినిమా.. ఓ బేబీ..  

 

అబ్బా అబ్బాబా.. ఈ సినిమా పిక్స్ అసలు.. ముసలి దానిలా సమంత భలే నటించింది.. వయసు ఉన్నప్పుడే అన్ని తినేయాలి అబ్బాయి అనే డైలాగ్ నాకు ఇంకా బాగా నచ్చింది.. ఎందుకంటే నేను కూడా ఆహార ప్రియురాలే కాబట్టి.. ఈ సినిమాను కూడా మళ్లి మళ్లీ చూడాలి అనిపిస్తుంది మరి. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ సినిమాలను ఈ లాక్ డౌన్ లో చూసేయండి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: