ఒక‌ప్పుడు టాలీవుడ్ లో ఓల్డ్ మూవీస్ అంటే గోల్డ్ మూవీస్ అని చెప్పాలి. ఒకప్ప‌టి పాత త‌రం సినిమాలు చూస్తుంటే మ‌న‌సుకు ఎంతో హాయిగా ఆనందంగా..ప్ర‌శాంతంగా ఉంటుంది. తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొట్టి చరిత్ర సృష్టిస్తే మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రను వేశాయి. అందులో ఒకటి ' మిస్సమ్మ' .. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్. ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క "మన్మొయీ గర్ల్స్ స్కూల్" అనే హాస్యరచన ఆధారంగా చక్రపాణి , పింగళి నాగేంద్రరావులు రచించగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో సినిమా పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కింది.

 

మిస్స‌మ్మ చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రూ చూసి తీరాల్సిన చిత్ర‌మిది. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమితమ‌య్యారు. దీంతో చాలా మందికి బోర్ ఫీల‌వుతూ ఉంటారు. ఇలాంటి పాత సినిమాలు చూసి చ‌క్క‌గా టైమ్ స్పెండ్ చేయ‌వ‌చ్చు. అంతేకాక ఈ పాత సినిమాల్లో ఎక్కువ‌గా స్టోరీ ఉంటుంది. అలాంటి సినిమాలు నేటి త‌రాలు మ‌న పిల్ల‌ల‌కు చూపించ‌డం వ‌ల్ల ఆ క‌థ ఆ కుటుంబ‌క‌థ‌లు విలువ‌లు, అందులోని నీతి గురించి మ‌నం చెప్ప‌కుండానే తెలుసుకుంటారు. పాత సినిమాల్లో అంత చ‌క్క‌టి క‌థ‌క‌థ‌నాలు ఉండేవి. అలాగే అప్ప‌టి సంగీతం కూడా ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాల‌నిపించే మ‌న‌సుకు హాయి క‌లిగించేలా ఉంటాయి. 

 

మిస్సమ్మ, 1955 ' సినిమాలో భానుమతి గారి మీద కొన్ని సన్నివేశాలు తీసి తరువాత చక్రపాణి - భానుమతి గార్ల మ‌ధ్య చిన్న గొడవ కారణంగా సావిత్రిని తీసుకోవ‌డం జ‌రిగింది. భానుమతి సెట్స్ కి ఆలస్యంగా వచ్చిన కారణంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే చాలా మందికి పాత సినిమాల మీద పెద్ద ఆశ‌క్తి ఉండ‌దు అలాంటిది పాత సినిమాల మీద ఇంట్ర‌స్ట్ క‌లిగేలా చేసేదే మిస్స‌మ్మ చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: