నేచ‌ర్‌స్టార్ నాని టాలీవుడ్‌లో ఉన్న మినిమ‌మ్ గ్యారెంటీ హీరో అని చెప్పాలి.  నాని సినిమాల్లో హీరోగా న‌టించ‌డ‌మే కాదు అత‌ని నేచ‌ర‌ల్ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాడు. ఈ లాక్‌డ‌వున్‌లో బోర్ ఫీల‌వుతున్న వారికి అలాగే నాని ఫ్యాన్స్ కోసం నాని న‌టించిన చిత్రాల్లో ఓ ఐదు చిత్రాల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. అవేమిటంటే ఒక‌టి నేను లోక‌ల్ చిత్రం దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. పైగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడంతో ఈ హైప్ మరింత పెరిగింది. సినిమాలోని ఆకట్టుకునే అంశాల్లో నాని క్యారెక్టరైజేషన్ ప్రధానమైనది. ఎప్పుడూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ అన్నింటినీ లైట్ గా తీసుకుని తాను అనుకున్నదే చేసే కుర్రాడు బాబు పాత్ర బాగుంది. ఆ పాత్రలో నాని నటన కూడా కొత్తగా ఉండి ఆకట్టుకుంది. 

 

ఇక రెంబో సినిమా  కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాధ కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇందులో నాని, మెహరీన్, సంపత్ రాజ్, మురళి శర్మ, బ్రహ్మాజి, పృద్వి, హరీష్ ఉత్తమన్, సత్యం రాజేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి నిర్వహించారు మరియు నిర్మాతలు అనిల్ సుంకర, గోపీ ఆచంట, రామ్ ఆచంట ముగ్గురు కలిసి నిర్మించారు. ఇది కూడా మంచి ఆహ్లాద‌క‌ర‌మైన చిత్ర‌మ‌ని చెప్పాలి.

 

మూడ‌వ చిత్రం జంటిల్‌మ్యాన్ ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు న‌టించారు. ఒక‌రు నివేదాథామ‌స్‌, మ‌రొక‌రు సుర‌భి. వీరిద్ద‌రూ చిత్రంలో నినికి బాగ సెట్ అయ్యార‌నే చెప్పాలి. ఈ క‌థ కూడా ప్రేక్ష‌కుడిని బాగానే ఆకట్టుకుంది. త‌ర్వాత నాలుగో చిత్రం జ‌ర్సీ. నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన మోస్ట్ ఎమోషనల్ జర్నీ ‘జెర్సీ’ నానిని క్రికెటర్‌గా ఆవిష్కరించాలన్న ప్రయత్నం బాగానే ఉన్నా.. ఆచరణలో పెట్టడం అంటే పెద్ద సాహసమే. అయితే ఆ సాహసాన్ని రెండో ప్రయత్నంతో విజయ తీరాలకు చేర్చారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అని చెప్పాలి. ఇక ఆఖ‌రి చిత్రం నిన్నుకోరి. ఈ చిత్రం టాలీవుడ్ సెలబ్రిటీలు. ప్రివ్యూ షో చూసిన అనంతరం చాలా మంది ఈ చిత్రానికి త‌మ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. 'నిన్ను కోరి' బ్యూటిఫుల్ ఫిలిం అని.. అందరూ ఇందులో అద్భుతంగా నటించారని ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ అంద‌రూ బాగా న‌టించార‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: