పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత 'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా కి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. 23 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల పైనే వసూళ్ళని రాబట్టింది. ఇక ఇదే సినిమాని కోలీవుడ్ లో బోని కపూర్ అజిత్ హీరోగా నిర్మించారు. అక్కడ కూడా దాదాపు 200 కోట్ల వరకు వసూళ్ళు సాధించింది. దాదాపు తమిళ వెర్షన్ లోను మాతృకలో ఉన్న అంశాలని దాదాపుగా చూపించారు. ఇక అమితాబ్ లాగా అజిత్ కూడా అద్భుతంగా నటించాడు.ఇదే కోలీవుడ్ లోను సూపర్ హిట్ అవడానికి కారణం అయింది.  

 

దాంతో ఈ సినిమాని బోనీకపూర్ తెలుగులో మళ్ళీ నిర్మించాలనుకున్నారు. దాంతో దిల్ రాజు ముందుకు వచ్చి ఇద్దరు కలిసి వకీల్ సాబ్ ని నిర్మిస్తున్నారు. అయితే  హిందీ తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకముందు కేవలం రెండు సినిమాల అనుభవమున్న వేణు శ్రీ రామ్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయడంతో అందరిలోను ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్లో 26వ గా నిర్మితమవుతుంది. 

 

అయితే బాలీవుడ్ కథలో లేని కొన్ని కీలక మార్పులు చేర్పులు తెలుగు వర్షన్ లో చేసినట్టు చిత్ర యూనిట్ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. పవన్ సరసన హీరోయిన్ ఉంటుందని, ఇద్దరికి సాంగ్స్ ఉంటాయని అలాగే పవర్ స్టార్ కోసం ప్రత్యేకంగా ఫైట్స్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. అవన్ని నిజాలేనని పవన్ రీ ఎంట్రీ మూవీ కాబట్టి అందుకో తెలుగులో ఆయన కి ఉన్న మార్కెట్, మాస్ ఫాలోయింగ్ ...హీరోయిజం ..ఇలా అన్ని లెక్కలేసుకొనే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించారని క్లారిటి వస్తుంది.

 

అయితే ఇలా మార్పులు చేర్పులు చేయడానికి పవన్ కళ్యాణ్ గత సినిమా గబ్బర్ సింగ్ కూడా ఇక కారణం అని తెలుస్తుంది. మరి ఈ మార్పులు చేర్పులు గబ్బర్ సింగ్ సినిమాలాగా రికార్డ్స్ క్రియోట్స్ చేస్తుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: