మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా మాస్ సినిమాలవే. చిరంజీవికి దక్కిన తిరుగులేని స్టార్ డమ్ కూడా మాస్ సినిమాల నుంచి వచ్చిందే. మెగాస్టార్ గా తెలుగు చిత్ర పరిశ్రమ నెంబర్ వన్ హీరోగా ఏలుతున్నాడంటే అదంతా మాస్ సినిమాల పుణ్యమే. అటువంటి చిరంజీవి కూడా ఒకానొక దశలో క్లాస్ సినిమాల కోసం తపించాడు. తనలోని నటనను బయటకు తెచ్చుకోవాలని ఆరాటపడ్డాడు. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమా చూసిన చిరంజీవి అప్పట్లోనే ఆలోచనలో పడ్డాడట.

 

 

ఈ విషయాన్ని ఇటివల చిరంజీవి గుర్తు చేసుకున్నాడు. ‘కమల్ హాసన్ చేసిన స్వాతిముత్యం సినిమా చూసి నేను ఆలోచనలో పడిపోయాను. డైనమిక్ హీరోగా, మాస్ హీరోగా మంచి స్టార్ డమ్ అనుభవిస్తున్న టైమ్ లో ఆ సినిమా చూసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. నేను కోల్పోతున్నదేమిటో అర్ధమై నిరాశలోకి వెళ్లిపోయాను. నా డిప్రెషన్ గమనించిన సుహాసినికి ఈ విషయం చెప్పుకున్నాను. ఓ సందర్భంలో కె.విశ్వనాధ్ గారికి ఈ విషయం చెప్పింది. గొప్ప నటులకు మంచి కథలు, పాత్రలు వెతుక్కుంటూ వస్తాయి. టైమ్ రావాలి అని నాతో అన్నారు. అన్నట్టుగానే నాకు స్వయంకృషి కథ చెప్పారు. నేను ఎదురుచూస్తున్న కథ అదే అనిపించి చేశాను’ అని చెప్పుకొచ్చారు.

 

 

స్వయంకృషి సినిమాలో చిరంజీవి నటన అద్భుతమనే చెప్పాలి. కష్టపడి జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎలా ఎదగాలో చెప్పే పాత్రలో ఆయన జీవించారు. ప్రేక్షకులు చిరంజీవి నటనకు కనెక్ట్ అయిపోయారు. కమర్షియల్ సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్లతో చిరంజీవి చెలరేగిపోతున్న సమయమది. కానీ.. ఈ క్లాసికల్ వండర్ సూపర్ హిట్ అయి 100 రోజలు ఆడింది. ఆ దశలో ‘చెప్పులు కుట్టే సుబ్బయ్య’ పాత్ర చేయడం చిరంజీవి చేసిన సాహసంగా కె.విశ్వనాధ్ ఇప్పటికీ చెప్తూంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: