నేచురల్ స్టార్ నాని 25వ సినిమా వి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నటించడం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్, నివేదా థామస్, అదితి రావు హైదరి నటించిన ఈ సినిమా ఇప్పటికే రిలీ కావాల్సి ఉండగా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. 

 

ఇక ఈ సినిమా తర్వాత నాని 'టక్ జగదీష్' సినిమా లో నటిస్తున్నాడు. ఇపటికే ఈ సినిమా కొంత టాకీ పార్ట్ కూడా షూటింగ్ జరుపుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు. నిన్ను కోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ రెండు సినిమాల తో పాటు మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. వాస్తవంగా ఈ మూడు సినిమాలు 2020 లోనే రిలీజ్ చేసి హిట్ కొట్టాలనుకున్నాడు. 

 

నాని నటించబోయో మరో సినిమాని టాక్సీవాలా డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న ఈ సినిమాకి 'శ్యామ్ సింగ రాయ్' అన్న టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సప్సెన్స్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కనుంది. రాహుల్ సంకృత్యన్ ఫస్ట్ విజయ్ దేవరకొండతో తీసిన సినిమా కూడా సస్పెన్స్ త్రిల్లరే. ఇక ఈ సినిమాలో నాని నటించబోయీ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో క్యారెక్టర్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది.  

 

ఇక ఈ సినిమాని ఆగష్టు నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు వెల్లడించనున్నారట. అయితే నాని ఇలా వరసగా ప్రయోగాలైతే చేసుకుంటూ వెళుతున్నాడు గాని హిట్స్ మాత్రం దక్కడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: