తెలుగు సినిమా పరిశ్రమలో అప్పటి స్టార్ హీరోల్లో దాదాపుగా అందరూ కూడా తమ కెరీర్ పరంగా భారీ స్థాయిలో అత్యధిక సినిమాల్లో నటించిన వారే అని చెప్పాలి. ఎన్టీఆర్ తరం మొదలుకొని చిరంజీవి, బాలకృష్ణ తరం వరకు గల హీరోలు దాదాపుగా వందకు పైచిలుకు సినిమాలు చేసిన వారే అని చెప్పాలి. అయితే దాని వలన వారు ఎక్కువగా తమ తమ కుటుంబాలతో హాయిగా విశ్రాంతిగా గడిపే అవకాశం కాస్త తక్కువగా ఉండేదని, ఏ మాత్రం వారికి తీరిక దొరికినా పలువురు కథకులు, దర్శక నిర్మాతలు ఆ హీరోల ఇళ్ల వద్దకు వాలిపోయేవారని, ఆ విధంగా అప్పటి నటులు ఎక్కువగా తమ సమయాన్ని సినిమాలకే కేటాయించవలసి వచ్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

అయితే అప్పటితో పోల్చుకుంటే ఇప్పటి తరంలో దాదాపుగా చాలా మంది స్టార్ హీరోలు కనీసం సంవత్సరానికి ఒక సినిమా చేయడం గగనం అయిన మాట నిజమేనని, అయితే ఒకప్పటి పరిస్థితి వలె టాలీవుడ్ లో ఇప్పటి పరిస్థితులు లేవని, అందువల్లనే వారు ఆ విధంగా కొంత ఆలస్యంగా సినిమాలు కంప్లీట్ చేయవలసి వస్తోందని అంటున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో కూడా చాలా మంది ఎక్కువ శాతం సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, ఇద్దరు హీరోలు మాత్రం అటు సినిమాలతో పాటు ఇటు తమ ఫ్యామిలీ లైఫ్ కి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ఫ్యామిలీ మ్యాన్స్ గా మంచి పేరు దక్కించుకుని కొనసాగుతున్నారు. కాగా వారిలో ముందుగా చెప్పుకోవలసింది సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, తనకు ఏ మాత్రం తీరిన దొరికినా సరే ఫ్యామిలీ తో సరదాగా సమయాన్ని గడపడానికి ఇష్టపడే సూపర్ స్టార్, కనీసం ఏడాదికి రెండు మూడు సార్లు ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్తుంటారు. 

 

అలానే మరొక నటుడైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎక్కువగా తన తీరిక రోజుల్లో ఫ్యామిలీ తోనే ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలానే ఆయన కూడా కొంత ఎక్కువ గ్యాప్ దొరికే సమయంలో భార్య, పిల్లలతో కలిసి పలు ప్రాంతాలకు వెకేషన్ వెళ్లడం గమనించవచ్చు. ఈ విధంగా ఈ ఇద్దరు స్టార్స్ కూడా ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్స్ గా అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీ ని సమానంగా బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్తున్నారని, అయితే మిగతా ఇతర హీరోలు కొందరు కూడా తమ ఫ్యామిలీలకు ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ, వారందరితో పోలిస్తే మాత్రం వీరిద్దరూ ముందు వరుసలో ఉంటారని అంటున్నారు విశ్లేషకులు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: