ఒక సినిమాలో హీరో హీరోయిన్ జోడీ బాగుండి సినిమా హిట్టయితే ఆ ఇద్దరికీ ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. అంతేకాదు ఇద్దరు ఎక్కడైనా కనబడితే చాలు ఇద్దరి మధ్య ఎఫైర్ అంటకట్టేస్తారు. అయితే  కలిసి నటించిన హీరో, హీరోయిన్ గురించి అలా అన్నా వాళ్ళ క్లోజ్ నెస్ రీజన్ అనుకోవచ్చు. కానీ ఒక సినిమాలో కూడా కలిసి నటిచకుండా టాలీవుడ్ లో ఒక క్రేజీ జోడీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అయితే అది ముగిసిన కథే అయినా అప్పటికి ఇప్పటికి ఒక అర్ధంకాని ప్రశ్నగానే ఉంది. 

 

ఇంతకీ ఆ ఈ సీక్రెట్ లవర్స్ ఎవరనేగా మీ డౌట్.. అక్కడకే వస్తున్నా.. దగ్గుబాటి హీరో రానా, సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష.. ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా కూడా చేయలేదు. కానీ ఇద్దరి మధ్య మాత్రం సంథింగ్ సంథింగ్ అని ఒకటే వార్తలు. మేమిద్దరం స్నేహితులం అని చెప్పినా ఈ వార్తలు ఆగవు. రానా అయితే  త్రిష గురించి అడిగితె ముభావంగానే సమాధానం చెబుతాడు. అసలు సంబంధం లేదన్నట్టుగానే ప్రవర్తిస్తాడు. కానీ ఇద్దరు కలిసి ఓ రేంజ్ లోఎంజాయ్ చేశారని ఇన్నర్ టాక్. 

 

ఇద్దరు కొన్నాళ్ళు డేటింగ్ లో ఉండి.. ఆ తర్వాత ఎవరిదారి వారు చూసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల గురించి కూడా రానా, త్రిష ఇద్దరు చాలా లైట్ తీసుకున్నారు. సినిమాలో జోడీ కట్టని వీళ్లిద్దరి గురించి ఈ రేంజ్ లో వార్తలు వచ్చాయి అంటే కచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో జరిగే ఉంటుంది. ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదు అన్న పాత సామెత ఒకటి ఉంది కదా... మొత్తానికి టాలీవుడ్ లో ఎప్పటికి రానా, త్రిషల గురించి టాపిక్ వస్తే అది హాట్ హాట్ గా ఉంటుంది. లాక్ డౌన్ టైం లో కూడా బోర్ కొడుతుందని త్రిష రానా, అల్లు అర్జున్ లకు ఫోన్ చేసి మాట్లాడిందని అంటున్నారు. అలా బయటకు కనిపించకుండానే రానా, త్రిష ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: