అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం కూడా బ్లాక్ బస్టర్ అవడంతో అతడి సినిమాలపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే అదే అతని సక్సెస్ కి అడ్డుగా మారింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన డియర్ కామ్రేడ్ యావరేజ్ టాక్ తెచ్చుకుని విజయ్ కెరీర్లో ఫ్లాప్ గా నిలిచింది.

 

నిజానికి డియర్ కామ్రేడ్ మంచి చిత్రమే.. కానీ అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉండడంతో వాటిని చేరుకోలేకపోయారు. డియర్ కామ్రేడ్ తర్వాత అతడు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీసు వద్ద భారి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత విజయ్ ఇక లవ్ స్టోరీలు చేయనని చెప్పేశాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీలో లవ్ స్టోరీ ఉన్నప్పటికీ, అది మెయిన్ స్టోరీ కాదట.

 

అయితే గతంలో విజయ్ ఒక సినిమా కాగానే తన తర్వాతి చిత్రం ఎవరితో ఉంటుందో చెప్పేశాడు. కానీ పూరీతో ఫైటర్ తర్వాత తన నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుందో ఇంతవరకు తెలియదు. విజయ్ తో సినిమా తీయడానికి చాలా మంది నిర్మాతలు రెడీగా ఉన్నారు. అలా రెడీగా ఉన్న వారిలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒకరు. ఫైటర్ తర్వాత విజయ్ మూవీ ఎవరితో ఉంటుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి దిల్ రాజు విజయ్ తో చేద్దామని అనుకుంటున్నాడట.

 

నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ హీరోగా దిల్ రాజు సినిమా నిర్మించాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పనులేవీ ముందుకు సాగకపోవడంతో ఈ నిర్ణయం ఇంకా ఫైనలైజ్ కాలేదట. లాక్డౌన్ ముగిసిన వెంటనే ఈ విషయంలో స్పష్టత వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: