చిత్రపరిశ్రమ ప్రస్తుతం వంశపార్యపరంగా వస్తున్న వారసులతో నిండి పోయింది. నాటి నుండి నేటి వరకు ఇలా సినీ రంగానికి చెందిన వారి వారసులు చిన్నప్పటి నుండే నటించడం మొదలు పెడుతున్నారు.. ఇక కొత్తవారు వస్తే నిలదొక్కు కోవాలంటే కాస్త టైం పడుతుంది.. అన్ని రకాలుగా కలసి వస్తే ఫర్వాలేదు గానీ, అదృష్టం వరించకుంటే అష్టకష్టాలు పడవలసిందే.. ఇకపోతే ఈనాడు సినిమా పరిశ్రమ ఇంత పెద్ద స్దాయికి చేరుకోవడానికి ఎందరో పెద్దల త్యాగాలు తెరవెనక దాగి ఉన్నాయి.. నాటికాలం పెద్దలు ఎంతగానో శ్రమిస్తే కానీ ఈ రోజు వెండితెర వెలుగులు చిమ్మడం సాధ్యపడలేదు..

 

 

ఇప్పుడు ఒక్కో నటుడి పారితోషికం గౌరవప్రదంగా ఉంది.. ఒక్క సారి చిత్రరంగంలో నిలదొక్కుకున్నాడంటే ఇక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేదు.. పేరుకు పేరు.. డబ్బులకు డబ్బులు.. ఇక 1913 వ సంవత్సర కాలంలో నటించడమే అతి హేయమైన, నీచ కార్యంగా భావించిన వారు ఉన్నారు.. అలాంటి స్దాయి నుండి ఒక్క అవకాశం అంటూ ఎంతకైనా దిగజారే మనుషులు తయారు అయ్యారు.. ప్రస్తుత కాలంలో సినిమా అనేది భూలోక స్వర్గం.. ఇక్కడ నిలదొక్కుకోవాలని కలలు కనని కనులు లేవు.. వయసులో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం జవసత్వాలు అన్ని నశించి యవ్వనాన్ని కొల్పోయి ఇంకా సెటిల్ అవకుండా ఆశతో బ్రతుకుతున్న వారు కూడా ఇక్కడ ఉన్నారు.. ఎందుకంటే సినిమా అంటే వారికంత పిచ్చి..

 

 

సినిమానే ఊపిరిగా, సినిమానే ప్రపంచంగా.. ఎప్పటికైనా తనను తాను నిరూపించుకునే అవకాశం కోసం ఆశతో ఎదురుచూస్తున్న వారు ఎందరో ఉన్నారు.. ఇక్కడ అన్ని కలసి వస్తే ఒక్క నైట్‌తో స్టార్.. లేకుంటే జీవితాంతం ఏదోలా బ్రతుకుతున్నారు.. ఇక ఈ సినిమా పిచ్చి అనేది కొందరికి స్వర్గం చూపిస్తే.. ఎందరికో నరకం చూపిస్తుంది.. ఇకపోతే ఇప్పుడంటే బాల నటులు చాలా మంది ఉన్నారు.. కానీ ఈ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా బాలనటుడిగా నటించిన తొలి భారతీయుడు ఎవరో తెలుసా.. అతనే బాలచంద్ర.. ఇతను ఫాల్కే కుమారుడు.. రాజా హరిశ్చంద్ర సినిమాలో హరిశ్చంద్రుని కుమారునిగా నటించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: