దర్శకుడు రాజమౌళి ఇచ్చిన ఛాలెంజ్ ని పూర్తి చేసిన జూనియర్ ‘మన ఇంట్లో ప్రేమలు, ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం’ అంటూ పనులు చేస్తూ షేర్ చేసిన వీడియో నిన్నటి మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. అయితే తనకు బాలకృష్ణకు కొనసాగుతున్న ఆనిశ్శబద్దాన్ని బ్రేక్ చేద్దామని జూనియర్ ఓపెన్ గా ప్రయత్నిస్తూ ‘బాలా బాబాయ్‌’ అంటూ ప్రేమగా పిలుస్తూ బాలయ్యనే ముందుగా తన ఛాలెంజ్‌ కు స్పందించమని చిరంజీవి నాగార్జున వెంకటేష్ లతో సమానంగా అడిగాడు. 


దీనితో నందమూరి అభిమానులు అంతా లాక్ డౌన్ సమయంలో ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న బాలకృష్ణ జూనియర్ సవాల్ కు స్పందిస్తాడని భావించాడు. అయితే జూనియర్ సవాల్ కు చిరంజీవి నాగార్జునల నుండి స్పందన వచ్చింది కానీ ఇప్పటి వరకు బాలయ్య నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. 


వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ బాలయ్యల మధ్య కనిపించని గ్యాప్ కొనసాగుతోంది. అయితే హరికృష్ణ మరణం తరువాత బాలయ్య జూనియర్ లు బాగా సన్నిహితంగా ఉంటున్నట్లు కొద్దిగా కనిపించినా ఆతరువాత మళ్ళీ ఈ గ్యాప్ యధావిధిగా బాలయ్య జూనియర్ ల మధ్య కొనసాగుతూనే ఉంది. 


దీనికితోడు అందరి టాప్ హీరోలు లా సోషల్ మీడియాలో బాలకృష్ణకు ఎకౌంట్స్ లేవు. మారుతున్న అభిరుచులను పసిగట్టి చిరంజీవి నాగార్జున లాంటి హీరోలు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో నిరంతరం టచ్ లో ఉంటూ తమ క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నించే విధంగా బాలయ్య అలాంటి ప్రయత్నాలు చేయడు. దీనికితోడు గత ఎన్నికలలో తెలుగుదేశం ఘోర పరాజయం చెందడం ఎన్టీఆర్ బయోపిక్ భంకరమైన ఫ్లాప్ గా మారడంతో పాటు బాలయ్య కలలు మోక్షజ్ఞ విషయంలో తారుమారు కావడంతో బాలకృష్ణ లాక్ డౌన్ ముందు నుంచి కూడ గంభీరమైన మౌనాన్ని కొనసాగిస్తున్నాడు. దీనితో జూనియర్ ఛాలెంజ్ ని బాలకృష్ణ సీరియస్ గా తీసుకోలేదు అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: