మిస్ వరల్డ్ గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న తరువాత హాట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ సక్సెస్ మాత్రం కాలేదు. ఆ సమయంలో సల్మాన్ పాకిస్థానీ బ్యూటీ సోమ అలీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 1999లో తెరకెక్కిన హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌లు కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చాలా ఏళ్ల పాటు సల్మాన్ ఐశ్వర్యలు డేటింగ్లో ఉన్నారు.
అప్పట్లో సల్మాన్ పలు ఇంటర్వ్యూలలో ఐశ్ పట్ల తన ఇంట్రస్ట్ ను పబ్లిక్ గానే చెప్పాడు. ఐశ్ వ్యవహార శైలి, జీవితం పట్ల ఆమె నిబద్దత అన్ని కలిసి ఆమెను ప్రపంచ సుందరిని చేశాయని చెప్పాడు సల్మాన్. అంతేకాదు తాను ఐశ్వర్యతో ప్రేమలో ఉన్నట్టుగా పబ్లిక్ గా అంగీకరించాడు సల్మాన్. నేను ఐశ్ను ప్రేమిస్తున్నాను. ఇది టీనేస్ లో ఉండే ఆకర్షణ కాదు. నాది స్వచ్చమైన ప్రేమ. ఆమె సాంప్రదాయ బద్ధమైన హిందుస్థానీ గర్ల్. ఆమె తల్లి దండ్రులను గౌరవించే విధానం నాకు ఎంతో నచ్చుతుంది అని చెప్పాడు సల్మాన్.
అయితే సల్మాన్ మరో అమ్మాయితో కూడా ఎఫైర్లో ఉండటంతో ఐశ్వర్య తనకు గుడ్‌బై చెప్పింది. అయితే సల్మాన్ మాత్రం ఐశ్‌కు బ్రేకప్ చెప్పేందుకు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్యే చాలా గొడవలు జరిగాయి. ఆ సమయంలో ఐశ్ ఇతర హీరోలతో నటించటంపై సల్మాన్ ఫైర్ అయ్యాడు. కొంత మంది హీరోల మీద సల్మాన్ చేయి చేసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా 2002లో వీరిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తరువాత చాలా కాలం పాటు ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురు పడటానికి కూడా ఇష్టపడలేదు.