టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత సైలెంట్ అయిన హీరో గోపి చంద్. ముందు విలన్ గా ఆ తర్వాత హీరోగా ఒక వెలుగు వెలిగాడు. మంచి సినిమాలు చేసినా సరే ఆ తర్వాత మాత్రం అతను ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. గత పదేళ్ళలో గోపి చంద్ హీరోగా వచ్చిన ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంచి సినిమా లేదు అనేది వాస్తవం. అతని నుంచి అభిమానులు ఏది అయితే కోరుకుంటున్నారో అది ఇవ్వడం లో అతను ఫెయిల్ అవుతున్నాడు అనేది అర్ధమవుతుంది. ప్రస్తుతం గోపి చంద్ ఒక సినిమాలో నటిస్తున్నాడు.

 

సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత లేదు. అయితే అతని ప్రేమ వ్యవహారం విషయానికి వస్తే... అతను అనుష్క ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని చూసాడు. ఆమెను ప్రేమించగా ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో గాని... వీరి ప్రేమ వ్యవహారానికి ఒక టాలీవుడ్ స్టార్ హీరో అడ్డం చెప్పారని టాక్. ఆయన వద్దని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. అందుకే అనుష్క గోపి చంద్ ని పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

హీరో గోపి చంద్ కెరీర్ ని తర్వాత ఇబ్బంది కూడా పెట్టారు అని కథనాలు కూడా వచ్చాయి. అనుష్క కు దగ్గరగా ఉంటే ఇబ్బంది పడటం ఖాయమని చెప్పడం తో గోపి చంద్ దూరమైనట్టు సమాచారం. వీరి పెళ్లి గురించి అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. అయినా సరే వీళ్ళు మాత్రం పెళ్లి చేసుకోలేదు. వీళ్ళ మీద మీడియా ఎన్ని కథనాలు రాసినా సరే వీళ్ళు మాత్రం దీని మీద ఎక్కడా స్పందించలేదు. గోపి చంద్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: