సినిమా వాళ్ల‌న్నాకు ప్రేమ‌లు, పెళ్లిళ్లు.. విడాకులు చాలా చాలా కామ‌న్‌. కొన్ని జంట‌లు అయితే ఎంత త్వ‌ర‌గా ప్రేమించుకుంటారో ?  ఎంత త్వ‌ర‌గా పెళ్లి చేసుకుంటారో ? అంతే త్వ‌ర‌గా విడిపోతారు.. మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సైఫ్ ఆలీఖాన్ త‌న‌కంటే వ‌య‌స్సులో చాలా పెద్ద‌ది అయిన అమృతాసింగ్‌ను ప్రేమించి పెళ్లాడాడు. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక త‌న కంటే వ‌య‌స్సులో చాలా చిన్న‌ది అయిన క‌రీనా క‌పూర్‌ను ప్రేమించి పెళ్లాడాడు.

 

ఇలాంటి సినిమా వాళ్ల ప్రేమ‌క‌థ‌లు మ‌నం ఎన్నో చూస్తుంటాం. అయితే వీట‌న్నింటికి భిన్న‌మైన ప్రేమ‌క‌థ క‌న్న‌డ స్టార్ కిచ్చ సుదీప్‌ది. సుదీప్ త‌న భార్య ర‌మ్య‌ను ఓ కాలేజ్‌లో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంప‌తుల‌కు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే చిన్న చిన్న కార‌ణాల‌తోనే వీరి మ‌ధ్య గ్యాప్ పెరిగి పెద్ద‌ది అయ్యింది. చివ‌ర‌కు విడాకులు తీసుకునే వ‌ర‌కు  వెళ్లింది. అయితే ఈ విడాకుల్లోనే చాలా ట్విస్ట్ ఉంది.

 

కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ మాత్రం తన భార్యతో విడాకులు కోరుకొని తన కూతురు కోసం మళ్లీ విడాకులు రద్దు చేసుకొని భార్యను చేరదీయడం విశేషంగా చెప్పవచ్చు. ఒక‌ప్పుడు సుదీప్ యంగ్ హీరోగా ఉన్న‌ప్పుడు క‌న్న‌డ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఈ క్ర‌మంలోనే ఓ కాలేజ్‌లో ర‌మ్య‌ను చూడ‌డం.. ప్రేమ‌లో ప‌డ‌డం పెళ్లి చేసుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. వీరు విడిపోవ‌డం కూడా చాలా మందికి న‌చ్చ లేదు. 

 

త‌ర్వాత కొంద‌రు పెద్ద‌లు చేసిన సూచ‌న‌ల మేర‌కు వీరు విడాకులు తీసుకున్నాక కూడా మ‌ళ్లీ క‌ల‌వ‌డం విశేషం. కన్నడ స్టార్ అయితే అలా చేశాడు కానీ మన తెలుగు తమిళ హిందీ తారలు మాత్రం సుదీప్ అడుగుజాడల్లో నడవకుండా బహుపెళ్లిళ్లకే మొగ్గుచూపారు.  కొంద‌రు ఎంతో ఘాడంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వాళ్ల‌కు విడాకులు ఇచ్చి మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డి పెళ్లిళ్లు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: