ఒకప్పుడు వెండితెరపై నెగిటీవ్ పాత్రల్లో నటించాలంటే సూర్యకాంతం, ఛాయాదేవి మరికొంత మంది నటించేవారు.  అయితే మరీ దారుణమై విలనీజం చూపించకుండా గయ్యాలి అత్తలు ఎలా ఉంటారో అలా చూపించేవారు. అప్పుడప్పుడు కొంత మంది నటీమనులు వెరైటీగా నెగిటీవ్ రోల్స్ లో కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పాత్రల్లో నటించేవారికి ఎక్కువ లైఫ్ ఉండదాని చాలా మంది భావిస్తుంటారు. హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే ఎక్కువగా పరిమితం అవుతుంటారు. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు రావడం.. పాత హీరోయిన్లు కనుమరుగు కావడం చూస్తుంటాం. కానీ తమ నటనకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న నటీమణులకు ఎప్పుడూ స్టార్ హీరోయిన్లుగానే వెలిగిపోతుంటారు.  

 

ఒకప్పుడు హీరో ఇప్పుడు క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్న శరత్ కుమార్ కూతురు  వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  గ్లామర్ పాత్రల్లో కనిపించాలి.. హీరోయిన్ గానే ఛాన్సులు రావాలన్న ఉద్దేశం మొదటి నుంచి తనకు లేదని చెబుతుంది. ఎలాంటి పాత్రలు అయినా.. నటనకు ప్రాధాన్యత ఉండాలని అంటుంది. అందుకే  వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ విలన్ గా నటిస్తూ మెప్పిస్తుంది. ఆ మద్య పందెం కోడి 2 , సర్కార్, తెనాలి రామకృష్ణ సినిమాల్లో విలన్ గా నటించింది.

 

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' అనే సినిమాని రవితేజ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ను ఎంపిక చేశారని సమాచారం. ఈ సినిమాలో ఆమెనే మెయిన్ విలన్ అనేది తాజా సమాచారం. తన భర్తను అంతం చేసిన హీరోపై పగ తీర్చుకునే విలన్ పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. అందుకు సంబంధించిన సన్నివేశాల్లో ఆమె నటన, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ మూవీ హిట్ అయితే ఈ బ్యూటీకి మంచి సక్సెస్ వచ్చినట్టే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: