మంచు భక్తవత్సలం నాయుడు అంటే కొద్ది మందికే పరిచయమున్న వ్యక్తి, అత్యంత సన్నిహితులకే తెలిసిన, పిలుచుకుంటున్న పేరు. అదే కలెకెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో గొప్పగా భావిస్తారు. భక్తవత్సలం గా చిత్ర పరిశ్రమలోకి ఎంటరయి మోహన్ బాబుగా మారి దాదాపు 570 కి పైగా సినిమాలలో నటించి తన కంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. నందమూరి తారకారామారావు గారి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో డైలాగ్స్ చెప్పగలిగ్ర ఏకైక నటుడు మోహన్ బాబు అన్న పేరుని సంపాదించుకున్నారు.

 

IHG

చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 1952 మార్చి 19న జన్మించాడు మోహన్ బాబు. ఏర్పేడు తిరుపతిలో చదువుకున్నారు. చెన్నై లో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు మోహన్ బాబు దర్శకత్వ శాఖలో పనిచేస్తూ స్వర్గం నరకం (1975) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి నటుడుగా పరిచమయ్యారు.

 

IHG

భక్తవత్సలం నాయుడు ని దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు స్వర్గం నరకం సినిమాతో మోహన్ బాబుగా మార్చారు. అంతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు కి శిష్యుడిగానే ఉండిపోయారు. స్వర్గం నరకం సినిమాతో నటుడిగా ప్రయాణం మొదలు పెట్టిన మోహన్‌ బాబు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తర్వాత హీరోగా, నిర్మాత గా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. దాసరి గారి తర్వాత మోహన్ బాబు కి అత్యంత సన్నిహితంగా ఉంది కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ ఇద్దరి మధ్య అనుబంధం చాలా ప్రత్యేకం. అన్న ఎన్.టి.ఆర్ అంటే మోహన్ బాబు కి ప్రత్యేకమైన అభిమానం. ఆయన అంటే దైవ భక్తి అంటారు మోహన్ బాబు. అందువల్లే ఎన్.టి.ఆర్ తో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమాని నిర్మించి ఆయనతో కలిసి నటించారు. 

 

IHG

సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. ఇక మోహన్ బాబు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. కాని వాస్తవంగా మోహన్ బాబుకి అవార్డ్స్ మీద అంతగా నమ్మకం ఉండదని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. ప్రేక్షకుల ప్రేమాభి మానాలు, ఆ భగవంతుడి దీవెనలు ముందు ఈ అవార్డలన్ని తక్కువే అంటారు. ఇక మోహన్ బాబు రంగంపేటలో శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు స్థాపించారు. ఎంతో మంది తన విద్యాసంస్థ ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని అభిలషిస్తారు. ఇక రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ను వ్యవహరించారు. 

 

IHG

ఇక మోహన్ బాబు తన కూతు లక్ష్మీ ప్రసన్న పేరు మీద నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో సక్సస్ ఫుల్ సినిమాలని నిర్మించారు. మోహన్ బాబు కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా నిర్మాతలుగా చిత్ర పరిశ్రంలో కొనసాగుతున్నారు. ఇక ఎవరికైనా ఆపద ఉందంటే ఏమాత్రం ఆలోచించకుండా మంచు ఫ్యామిలీ మొత్తం సహాయం చేయడానికి ముందుంటారు. ఈ విషయంలో ఎవరి ఆలోచన కోసం గాని ఎవరి నిర్ణయం కోసం గాని ఎదురు చూడరు. ముక్కుసూటిగా మాట్లాడే మోహన్ బాబు లో కనిపించని దయాగుణం ఉందని అది అనుభవించిన వాళ్ళే చెబుతుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీకొచ్చి 45 ఏళ్ళు గడుస్తున్నప్పటికి ఏరోజు ఎవరి దగ్గర తల వంచడం, గాని చేయి చాచడం గాని చేయని వ్యక్తి మంచు (మోహన్ బాబు) భక్తవత్సలం నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: