సినిమాల్లో ప్రేమకథలు ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకుల్ని మైమరిపిస్తూంటాయి. అందమైన లవ్ స్టోరీస్ చాలా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకులు తమ టాలెంట్ ను ఉపయోగిస్తూంటారు. లవ్ స్టోరీస్ కు సినిమాల్లో ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. మొనాటనీ ఏమాత్రం లేని కథలు ప్రేమకథలు మాత్రమే. ఇటువంటి లవ్ స్టోరీలు తెర మీద మాత్రమే కాకుండా సెలబ్రిటీల లైఫ్స్ లో కూడా జరుగుతూంటాయి. అలాంటి సెలబ్రిటీల లవ్ స్టోరీల్లో టాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ, సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ జంట కూడా ఉంది.

 

 

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ, స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రేమ వివాహం అప్పట్లో ఆసక్తి రేపింది. కృష్ణవంశీ డైరక్టర్ అయ్యేప్పటికే రమ్యకృష్ణ టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్. వీరిద్దరి ప్రేమకు బీజం పడింది చంద్రలేఖ సినిమా సమయంలో. 1998లో వచ్చిన చంద్రలేఖ సినిమా షూటింగ్ సమయంలో తాము ప్రేమలో పడినట్టు కృష్ణవంశీనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. 5ఏళ్ల ప్రేమ అనంతరం వీరిద్దరూ 2003లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. మూడేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోయారంటూ అనేక వార్తలు షికారు చేశాయి.

IHG

 

దీనిని తమ పర్సనల్ విషయంగా భావించిన రమ్యకృష్ణ ఎక్కడా స్పందించలేదు. దీనిపై కృష్ణవంశీనే ఓ ఇంటర్వ్యలో స్పందించారు. ’నేను రమ్యకృష్ణ విడి విడిగా ఉంటున్నామనే వార్తల్లో వాస్తవం లేదు. షూటింగ్స్ నిమిత్తం ఆమె హైదరాబాద్చెన్నై బిజీగా ఉండటం.. చెన్నైలో షూటింగ్ నిమిత్తం ఎక్కువగా ఉండటంతో ఈ రూమర్లు వస్తున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం. మేమిద్దరం చాలా హ్యీపీగా ఉన్నాం. దీనిని నిరూపించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా మా పర్సనల్ విషయం’ అని ఆ గాసిప్స్ కు చెక్ పెట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: