టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఈ మద్య సోషల్ మాద్యంలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఆయన హడావుడి అంతా ఇంతా కాదు.  సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే.  గతంలో ఎప్పుడు తాను సోషల్ మాద్యమాల గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాదని.. ఈ మద్య ప్రతి ఒక్కరూ తమ సందేశాలు, సూచనలు, సలహాలు సోషల్ మాద్యమాల ద్వారా పంచుకుంటున్నారు.. అందుకే నేను కూడా ఇందులో అడుగు పెట్టానని అంటున్నారు.  దేశంలో కరోనా వైరస్ వల్ల ఎంత ప్రభావితం అవుతుందో తెలిసిందే.  సినిమా పరిశ్రమ అంతా అగమ్య గోచరంగా తయారైంది.  ఓ వైపు షూటింగ్స్ ఆగిపోయాయి.. రిలీజ్ లు వాయిదావేసుకున్నారు.

 

అన్ని సినీ పరిశ్రమల కళాకారులు ఇంట్లో ఉంటూ రక రకాల పనులు చేస్తున్నారు.  ఈ మద్య టాలీవుడ్ లో చాలెంజ్ లు కూడా మొదలు పెట్టారు. అయితే చిరంజీవి మాత్రం కరోనాపై అవగాహనకు సంబందించి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.  మెగా ఫ్యామిలీ మొత్తం ఈ మద్య ఫ్లకార్డులు పట్టుకొని కరోనాపై తమ సందేశాలు తెలిపారు.  ఈ నేపథ్యంలో, చిరుపై నలువైపుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే సోషల్ మాద్యమంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవం ఎలా ఉందనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగారు.

 

దానికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ..  సోషల్ మీడియా అంటనే అందరితో కలిసిపోవడం అన్నారు.  తమ అభిమానులతో అనుభవాలు షేర్ చేసుకోవడం.. ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు.  ఇప్పుడు కరోనా పై సోషల్ మాద్యమాల ద్వారా ఎంతో మందికి తమ సందేశాలు అందిస్తున్నారు. నేను సోషల్ మాద్యమంలోకి వచ్చిన తర్వాత సహ నటులకు, సన్నిహితులకు ఎంతో దగ్గరైనట్లు అనిపిస్తుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: