మహేశ్ బాబు ఇప్పటి వరకు బాలీవుడ్ వెళ్లలేదు. నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కటౌట్ ఉన్నా ముంబయి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అసలు బీటౌన్ కు వెళ్లే ఆలోచన లేదని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ చాలా మంది హర్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు వాళ్లందరినీ ఖుషీ చేసే బాధ్యతలు తీసుకుంటున్నాడు రాజమౌళి. 

 

మహేశ్ బాబు ఫస్ట్ టైమ్ బైలింగ్వల్ లో స్పైడర్ సినిమా చేశాడు. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. మహేశ్ తమిళ ఆశలను క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ ఫ్లాప్ తర్వాత మహేశ్ బైలింగ్వల్స్, మల్టీ లింగ్వల్స్ అనే ఆలోచన చేయలేదు. తెలుగు సినిమాల్లోనే నటిస్తున్నాడు. 

 

మహేశ్ బాబు తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. కె.ఎల్ నారాయణ నిర్మాణంలో వీళ్ల సినిమా అనౌన్స్ అయింది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ కు వెళ్లబోతోంది. ఇక ఈ మూవీతోనే మహేశ్ బాబు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. నో మల్టీలింగ్వల్స్ అనే మహేశ్ ని, జక్కన్న బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కిస్తాడనే టాక్ నడుస్తోంది.

 

రాజమౌళికి బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ డైరెక్టర్ ఇమేజ్ వచ్చింది. ఈ దర్శకుడి సినిమా అనగానే నార్త్ మార్కెట్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అందుకే ట్రిపుల్ ఆర్ మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ గా మారింది. సో ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తీయబోయే మహేశ్ సినిమా కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా మారుతోందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీతోనే ప్రిన్స్ ముంబయి జనాల ముందుకు వెళ్లే అవకాశముంది. 

 

బాహుబలి తర్వాత ప్రభాస్, రానా ఇద్దరూ మల్టీలింగ్వల్స్ నే సెలక్ట్ చేసుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియన్ స్టోరీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా మల్టీలింగ్వల్స్ లోనే నటించే అవకాశముంది. ఇక మహేశ్ బెటర్ హాఫ్ నమ్రత శిరోద్కర్ కు ముంబయిలో మంచి పీఆర్ ఉంది. అక్కడ ఆమె హీరోయిన్ గా సినిమాలు కూడా చేసింది. సో ఈ రిలేషన్స్ తో ప్రిన్స్ బాలీవుడ్ లో ఈజీగా మార్కెట్ పెంచుకుంటాడని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: