దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ కూతుళ్లు మరోసారి తమ గొప్ప మనస్సును చాటుకున్నారు. కొన్ని రోజుల క్రితం కరోనా క్రైసిస్ చారిటీకి 2 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన రాజశేఖర్ కూతుళ్లు తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 2 లక్షలు ఇచ్చారు. 
 
మంత్రి కేటీఆర్ ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును వారు అందజేశారు. కేటీఆర్ వారిద్దరినీ అభినందించారు. రాజశేఖర్ కూడా ఇప్పటికే సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం శివాని, శివాత్మిక మీడియాతో మాట్లాడుతూ తమ వంతుగా వీలైనంత సహాయం చేయడానికి ముందుకొచ్చామని తెలిపారు. కరోనా విజృంభణ తగ్గేవారకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. 
 
ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కరోనా సోకకుండా జాగ్రత్తలను తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. స్టే హోమ్... స్టేఫ్ హోమ్ అని ప్రజలకు సూచనలు చేశారు. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ను చూస్తూ పెరిగామని... వారు జీవితంలోని అనేక కోణాలలో స్పూర్తి నింపారని అన్నారు. ఎల్లప్పుడూ దయతో బాధ్యతాయుతంగా మెలగాలన్నది వారిని చూసి నేర్చుకున్నామని తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ వంతు సహాయం చేస్తున్నారు. కొంతమంది నగదు రూపంలో సహాయం చేస్తుండగా మరికొందరు ఆహారం, నిత్యావసరాలు అందిస్తూ గొప్ప మనస్సును చాటుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం సహాయం చేస్తూ గొప్ప మనస్సును చాటుకుంటారు. కరోనా కష్ట కాలంలో బాధితులను ఆదుకోవడానికి విరాళాన్ని ప్రకటిస్తున్నారు.                        

మరింత సమాచారం తెలుసుకోండి: