ఇప్పుడు అసలు సమస్య ఫేస్ చేయవల్సింది థియేటర్లు. లాక్ డౌన్ కారణంగా నెలకు పైగా థియేటర్లు అన్నీమూతపడి ఉండటంతో లాక్ డౌన్ తరువాత కూడా థియేటర్స్ కు గడ్డు కాలమే కనిపిస్తోంది. ఇప్పటికే మల్టీప్లక్స్ లతో నష్టపోతున్నామంటున్నవారు ఇప్పుడు ఈ పరిస్థితి వల్ల చాలా వరకు థియేటర్లు ఏకంగా క్లోజ్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాయి.

 

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్ల పరిస్థితి భయంకరంగా తయారు అయ్యింది. దాదాపు నెల పైనే అవి మూసి ఉండటంతో భారీ నష్టాలు చూస్తున్నారు థియేటర్ల యజమానులు.. ఇక థియేటర్ల పరిస్థితి బాలేక మూత పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. పెద్ద పెద్ద మల్టీ ప్లెక్స్ లు, స్క్రీన్ లు  తెరిచినా..ఈ నష్టాలను కంప్లీట్ చేయడానికి పక్కాగా టికెట్ల రేట్లు పెంచే అవకాశం ఉంటుంది.

 

దాంతో అటు కరోనా భయం... ఇటు టికెట్ల  రేట్ల వల్ల చాలా వరకు జనాలు సినిమా థియేటర్లకు దూరం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అందులోను ముందులాగా....మందలకు మందలను లోపలికి  వెళ్లనీయకుండా 200 సీట్లు ఉండే థియేటర్ లో  100 మందే సినిమా చూసేలా.. సొషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయించే ఆలోచనలో ఉన్నారు. దాంతో ఈ నష్టాలను టికెట్ రేట్లు పెంచడం ద్వారా పూడ్చుకునే అవకాశం ఉంది.

 

లాక్ డౌన్ తరువాత కూడా కరోనా భయం జనాలలో ఇప్పుడప్పుడే వదిలే అవకాశం లేదు. థియేటర్ల సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా కష్టం.. దాంతో ఎక్కువగా ఆడియన్స్ థియేటర్ల వైపు ఇప్పుడప్పుడే చూసే అవకాశం లేదు. అందులోను థియేటర్లు బ్రతకాలంటే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వాలి. కాని ఇప్పట్లో అంత పెద్ద స్టార్ హీరోల సినిమాలేవి రిలీజ్ కు లేవు. దాంతో ఈ నాలుగు నెలలు చిన్న సినిమాలు చూడటానికి జనాలు థియేటర్లకు రాకపోవచ్చు. ఒక వేళ థియేటర్లకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ వచ్చినా.. ముందు ఆడియన్స్ నుంచి కూడా స్పందన ఉండాలి కదా.  అసలు లాక్ డౌన్ తర్వాత చూడాలి పరిస్తితి ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: