అమరశిల్పి జక్కన శిల్పం చెక్కితేనే కానీ బయటకు వచ్చేది కాదు. మన టాలీవుడ్ జక్కన రాజమౌళి కూడా అంతే. ఆయన చెక్కుడుకు ఇక్కడ కాలాలూ, క్యాలండర్లూ గిర్రున తిరిగిపోవాల్సిందే. కంప్లీట్ రిలాక్సింగ్ మూడ్ లో జక్కన్న షూటింగ్ చేస్తూ ఫుల్  అవుట్ పుట్ రాబడతాడు. అయనకు ఆదరబాదరా అన్నది అసలు నచ్చదే  నచ్చదు. 

 

అటువంటి జక్కన్న ఫస్ట్ టైం టెన్షన్ పడుతున్నాడు. అదే ఆయన ఆర్.ఆర్.ఆర్ మూవీ విషయంలో జక్కన్న ఆశలను కరోనా కాటేసేలా కనిపిస్తోంది. కరోనా మహమ్మరి పుణ్యమాని లాక్ డౌన్ వచ్చేసింది.ఇక అత్యవసరం తప్పితే మరేమీ అనలేని, కొనలేని సీన్. దాంతో సినిమా బొమ్మలు ముసుగేసుకున్నాయి. ఈ నేపధ్యంలో జక్కన్న ఇపుడు కంగారు పడుతున్నాడుట.

 

తాను చేసిన లేట్ కి కరోనా మరో ఏడాది కలిపిస్తే ఇక మూవీ సంగతేంటన్నదే జక్కన్న కంగారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే జక్కన్నకు తన సినిమా ఎపుడు పూర్తి అవుతుందన్న క్లారిటీ కొంత వచ్చిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ 2021 జనవరికి వచ్చేది కాదని కూడా అర్ధమైపోయిందట. దాంతో సమ్మర్ 2021కి సినిమాని రిలీజ్ చేయాలని ఇప్పటికి ఉన్న ఆలోచన.

 

ఇదే జరిగితే పాజిటివ్ బజ్ ఉంటుందా. ఏడాది వరకూ జనాన్ని, ఫ్యాన్స్ ఆసక్తిని  ఉగ్గబట్టి ఉంచడం కష్టమేనా అన్న ఆలోచనలు కూడా జక్కన్నలో కలుగుతున్నాయట. దీంతో ఆయన  మీడియాను ఈసారి గట్టిగానే  నమ్ముకున్నారు.

 

అందువల్లనే లాక్ డౌన్ వేళ కూడా ఆయన  జాతీయ చానళ్ళకు, ప్రాంతీయ చానళ్ళకు కూడా ఇంటర్వ్యూలు వరసగా ఇచ్చేస్తున్నారు. తన మూవీ వచ్చే ఏడాది సమ్మరి కి వస్తుందని  ఇండైరెక్ట్ గానే  అటు ఫ్యాన్స్ ని ఇటు ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్నాడు. మొత్తానికి తెలివంటే జక్కన్నదేగా. కీప్ ఇట్ అప్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: