టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు.  కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అయితే దర్శక, నిర్మాతల తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు.. అలాంటి వారిలో అల్లరి నరేష్ ఒకరు.  ఈవీవీ సత్యనారాయణ తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  కాకపోతే ఆర్యన్ రాజేష్ ఆ మద్య సినిమాలకు దూరమయ్యారు.. అప్పుడప్పుడు గెస్ట్ పాత్రల్లో కనిపిస్తున్నారు.  రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ లు కామెడీ హీరోలుగా కొనసాగారు. వారి తర్వాత అల్లరి మూవీతో నరేష్ కామెడీ హీరోగా తన చాటడం మొదలు పెట్టాడు. 

 

సుడిగాడు తర్వాత ఈ అల్లరోడికి పెద్దగా కలిసి రావడం లేదు. అప్పుడప్పుడు మల్టీస్టారర్ మూవీలో కూడా నటిస్తున్నారు.   హీరోగా చాలా వేగంగా ఆయన 50 సినిమాలను పూర్తి చేశాడు. గత ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ అయ్యింది.  ఈ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహర్షి మూవీలో తన జ్ఞాపకాల గురించి ప్రస్తావించారు.  'మహర్షి' సినిమాలో చేయడం ఒక మరిచిపోలేని అనుభవం. నటన పరంగా నాకు మరిన్ని మార్కులు తెచ్చిపెట్టిన పాత్ర అది.  

 

ఈ మూవీలో నటించేటపుడు షూటింగ్ స్పాట్ లో మహేష్ బాబు వస్తే ఎంతో సందడిగా ఉండేదని అన్నారు. అంతేకాదు ఆయన ఎంత గొప్ప పొజీషన్ లో ఉన్నా కూడా ఎదుటి వారిని ఎంతో గౌరవిస్తారని అన్నారు.  ఆ సినిమా షూటింగు సమయంలో మహేశ్ బాబు నన్ను 'సార్' అని పిలిచేవారు. ఆయన అలా పిలుస్తున్నప్పుడల్లా నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. సెట్లో అందరితోను ఆయన చాలా కలుపుగోలుగా వుంటారు. నటన పరంగానే కాదు, వ్యక్తిత్వం విషయంలోను ఆయన సూపర్ స్టారే' అంటూ చెప్పుకొచ్చాడు. 'అల్లరి' నరేశ్ తాజా చిత్రంగా 'నాంది' రూపొందుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: