కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు తమిళ స్టార్ హీరో దళపతి  విజయ్ భారీ విరాళాలను ప్రకటించాడు. అయితే కేవలం తన సొంత రాష్ట్రం తమిళనాడు కు మాత్రమే కాకుండా సౌత్ లోని ఇతర రాష్ట్రాలకు  కూడా విజయ్ విరాళాలు ప్రకటించడం విశేషం.
 
అందులో భాగంగా  పీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు ,తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్  కు 50లక్షలు, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షలు, ఎఫ్ఈఎఫ్ఎస్ఐ కి 25 లక్షలు, కర్ణాటక సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షలు , తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షలు, పాండిచ్చేరి సీఎం రిలీఫ్ ఫండ్ కు 5లక్షలు... ఇలా మొత్తం  కోటి 30లక్షల రూపాయల విరాళాన్ని విజయ్ ప్రకటించాడు. ఇక విజయ్ చేసిన  ఈపనికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
 
ఇదిలావుంటే విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ విడుదలకు సిద్ధంగా వుంది. కరోనా లేకుంటే ఈపాటికే థియేటర్లలోకి రావాల్సింది కానీ దాని దెబ్బకు మరో రెండు నెలల వాయిదాపడింది. జూన్ లేదా జూలై లో ఈ సినిమా ను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ సంగీతం అందించిన  ఈచిత్రాన్ని ఎక్స్ బి క్రియేటర్స్ నిర్మించింది. ఇంతకుముందు విజయ్ నటించిన సర్కార్ , విజిల్ సూపర్ హిట్లు కావడంతో తెలుగులోనూ మాస్టర్ పై భారీ అంచనాలు వున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: