పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా పవర్ స్టార్ అంటే స్పెషల్ క్రేజ్. ఒకానొక దశలో చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ అంటేనే పడి చచ్చే ఫ్యాన్స్ ఏర్పడ్డారని చెప్పొచ్చు. ఇదిలాఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఆడియెన్స్ కు మాత్రమే కాదు సినీ స్టార్స్ కు అభిమానమే. పవన్ ను అభిమానించే వారిలో చాలామంది స్టార్స్ ఉన్నారు. అయితే కేవలం హీరోలే కాదు దర్శకులు కూడా పవన్ పిచ్చిలో పడ్డారు. 

 

తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి ఆ టైం లో పవన్ అంటే ఒక క్రేజ్.. ఇదే సందర్భాన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించిన దర్శక ధీరుడు రాజమౌళి అప్పుడు ఆంధ్రా యూత్ అంతా పవన కళ్యాణ్ మోజులో ఉండేవారు. అప్పుడు పవన్ అంటే పిచ్చి.. ఆ పిచ్చి తనకు అంటిందని అన్నారు రాజమౌళి. కొన్నాళ్ళు తానూ కూడా పవన్ ను ఇష్టపడ్డానని అన్నారు మన జక్కన్న. అంతేకాదు డైరక్టర్ అయ్యాక పవన్ కళ్యాణ్ సినిమా ఆడియోకి గెస్ట్ గా వెళ్లిన రాజమౌళి పవర్ స్టార్ ఆడియోకి వస్తే పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఉండదని.. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాట్లాడనివ్వరని అన్నారు. 

 

పవర్ స్టార్ పంజా ఆడియో రిలీజ్ కు గెస్ట్ గా వచ్చిన రాజమౌళి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను చూస్తే చాలా హుషారుగా ఉంటుందని అన్నారు. అయితే అప్పట్లోనే పవర్ స్టార్ తో సినిమా ఎప్పుడని ఫ్యాన్స్ అడుగగా అది తనని కాదు ఆయన్నే అడగండని అన్నారు రాజమౌళి. ఒకవేళ రాజమౌళి కనుక పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే ఆ సినిమా కు బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ కాదు ఎలాంటి సినిమా రికార్డులు అయినా పక్కకు తప్పుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: