ఇటీవల తన సినీ ప్రస్థానంలో సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, గత ఏడాది రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాని తెరకెక్కినచడం జరిగింది. నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ తో ఎన్నేళ్ళగానో కెరీర్ పరంగా కొంత వెనుకబడి ఉన్న పూరి, మళ్ళి తన పూర్వ వైభవాన్ని పొందారు. ఇక దాని తరువాత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా తీస్తున్న పూరి జగన్నాథ్, ఆ సినిమాని ఎంతో భారీ గా పాన్ ఇండియా రేంజ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 

 

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నటి ఛార్మి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని ఇటీవల కరోనా మహమ్మారి ఎఫెక్ట్  కారణంగా లాక్ డౌన్ ని ప్రకటించడం తో షూటింగ్ ని నిలుపుదల చేసింది సినిమా యూనిట్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజలు గా కొందరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా అన్ని భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతోందని, ఇప్పటికే పలువురు దర్శకులు ఇటువంటి సినిమాలు తీసి మంచి హిట్స్ కొట్టిన వారు ఉన్నారని, అలానే ఈ తరహా సినిమాలు తీసి ఆశించిన రేంజ్ లో హిట్ అందుకోలేక ఫ్లాప్ అందుకున్న వారు కూడా లేకపోలేదని అంటున్నారు. 

 

అదీకాక పూరి నుండి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం, అలానే విజయ్ దేవరకొండ కూడా కెరీర్ పరంగా ఈ సినిమా ద్వారా భారీ స్థాయి యాక్షన్ మూవీలో నటించడం ఫస్ట్ టైం కావడంతో దీనిని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనే అనుమానాన్ని వ్యక్త పరుస్తున్నారు. అయితే ముఖ్యంగా పూరి రాసే కథల్లో మంచి ఫీల్ ఉంటుందని, ఒకవేళ అది ఆడియన్స్ కి కొంత కనెక్ట్ అయితే చాలు సినిమా గొప్ప విజయం అందుకోవడం ఖాయం అని, కానీ అది ఏ మాత్రం బెడిసి కొట్టినా సరే, ఈ పాన్ ఇండియా మూవీతో పూరి, విజయ్ ల ఫేటుమారడం సంగతి అటుంచి, అది వారి కెరీర్ పై కొంత వేటు వేసే అవకాశం ఉందని అంటున్నారు......!!   

మరింత సమాచారం తెలుసుకోండి: