మ్యాచో హీరో గోపిచంద్ హిట్ చూసి చాలా రోజులైంది.  అప్పుడెప్పుడో లౌక్యం తో హిట్ కొట్టాడు అంతే  అప్పటినుండి ఇప్పటివరకు అరడజనకు పైగా  సినిమాలు చేశాడు అందులో ఏ ఒక్కటి హిట్ అనిపించుకోలేకపోయింది. దాంతో గోపిచంద్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అయినా కూడా సాయం చేయడం విషయంలో మాత్రం ఈహీరో ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా వల్ల షూటింగ్ లు లేక సినీ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. వీరిని ఆదుకోవడానికి  టాలీవుడ్ పెద్దలు కరోనా క్రైసిస్  చారిటీ (సీసీసీ) ని ఏర్పాటు చేసివిరాళాలను సేకరిస్తున్నారు.
 
ఇప్పటికే ఈ సంస్థ కు భారీ మొత్తంలో విరాళాలు రాగ తాజాగా  గోపిచంద్ కూడా సీసీసీ కి 10 లక్షల విరాళం ను ప్రకటించాడు. అంతేకాదు 1500మంది అనాథలకు 2 నెలల పాటు అండగా వుండనున్నాడు అలాగే ఇప్పటికే 2000 కుటుంబాలకు గోపిచంద్ నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేశాడు. ఇక  గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో సీటీమార్ లో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఈసినిమా సగానికిపైగా  షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్  గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా భూమిక చావ్లా , దిగంగన సూర్యవంశీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఈ చిత్రం పై గోపిచంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.
 
సినిమా తరువాత గోపిచంద్ ,తేజ డైరెక్షన్ లో అలివేలు మంగ వెంకటరమణ లో నటించనున్నాడు. ఆగస్టు లో సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది విడుదలకానుంది. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: