లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా కారణంగా ప్రజలంతా ఇల్లు వదిలి బయటకిరానీ పరిస్థితి. దీంతో సినిమా ప్రేక్షకులంతా ఓటిటి ప్లేట్ ఫామ్ ద్వారా సినిమాలు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ కి మంచి టైం వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా వైరస్ పుణ్యమా ఓటిటి ద్వారా గ్రామాల్లో ఉన్న వాళ్లు కూడా సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఇదిలా ఉండగా ఓటిటి రంగం లో మొట్ట మొదటిగా అడుగుపెట్టిన SUNNXT లో చాలామంది ప్రేక్షకులు చూస్తున్న టాప్ 5 సినిమాల వివరాలు మీకోసం. 

 

ఆ నలుగురు:

 

రాజేంద్ర ప్రసాద్ నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఫ్యామిలీ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. సమాజంలో మంచి వ్యక్తిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ కి కుటుంబంలో విలువ ఉండదు. అయితే అతను చనిపోయిన తరువాత దర్శకుడు చూపించిన సన్నివేశాలు నిజజీవితంలో మనిషి యొక్క ప్రవర్తనను సమాజం స్పందించే విధానాన్ని డైరెక్టర్ అద్భుతంగా చూపించారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలా మంది సినిమా ప్రేక్షకులు SUNNXT లో ఈ సినిమాని బాగా చూస్తున్నారు. 

 

అన్నమయ్య:

 

వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాగార్జున నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాగార్జున నటించిన నటనకు చాలామంది అప్పట్లో ఆడియన్స్ ముగ్ధులయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాని కూడా SUNNXT లో ప్రేక్షకులు బాగా చూస్తున్నారు.

 

 

నిజం:

 

తేజ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రక్షిత హీరోయిన్ గా తెరకెక్కింది. సమాజంలో అవినీతి చేసే అధికారులను అంతమొందించే విధంగా ఈ సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్ తేజ. మహేష్ బాబు తన తండ్రిని కోల్పోవటంతో...మొదట అమాయకంగా ఉన్నాగాని తరువాత విలన్స్ ని పై పెట్టేవిధంగా తన క్యారెక్టర్ మార్చుకునే విధానం ఈ సినిమాకే హైలెట్. ప్రస్తుతం ఈ సినిమాని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. 

 

అంతపురం:

 

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సౌందర్య మరియు సాయికుమార్ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటించిన నటన ఈ సినిమాకే హైలెట్. జగపతిబాబు కొద్దిసేపు ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. అనంతపురం లాంటి ఇంటిలో సాయి కుమార్ చనిపోయిన తర్వాత సౌందర్య ఇంటి నుండి ప్రకాష్ రాజు నుండి తప్పించుకోవటం కోసం చేసే ప్రయత్నాలే సినిమా యొక్క స్టోరీ. ఈ సినిమాని కూడా బాగా చూస్తున్నారు.

 

ఖలేజా:

 

ఇండస్ట్రీ లో మహేష్ బాబు నటించిన అన్ని సినిమాల్లో నటన లకు భిన్నంగా ఉంటుంది ఖలేజా సినిమాలో. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా తర్వాత మహేష్ నాలో చాలా మార్పు వచ్చింది. ఖలేజా సినిమా ముందు వరకు చాలా సైలెంట్ కలిగిన పాత్రలు చేసిన మహేష్...ఈ సినిమా ద్వారా తన లో ఉన్న కామెడీ టైమింగ్ ని బయటకి తీసి ప్రేక్షకులను బాగా అలరిస్తాడు. మహేష్ లో కామెడీ టైమింగ్ పంచ్ టైమింగ్ లేదు అన్న నెపాన్ని ఈ సినిమా ద్వారా విమర్శకులకు గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు మహేష్. SUNNXT లో ప్రస్తుతం ఈ సినిమాని కూడా ప్రేక్షకులు బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: