ప్రస్తుతం అంతా ఓటిటి హవా నడుస్తుంది. డిజిటల్ యుగంలో బాగా టెక్నాలజీకి అలవాటైన ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కూడా ఆ విధంగానే కోరుకుంటున్నారు. ఒకానొక సమయంలో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూడటం కోసం థియేటర్లకు వెళ్లే జనాలకి ఓటిటి ఇప్పుడు బాగా దగ్గరయ్యింది. సినిమాలు సీరియల్స్ ఒకప్పుడు టీవీలో చూసేవాళ్లం. అయితే ఎప్పుడైతే ఓటిటి రావటం జరిగిందో జనాలు టీవీలు చూడటం చాలావరకు తగ్గించేశారు. ముఖ్యంగా ఇటీవల కరోనా వైరస్ రావటంతో ప్రజలంతా ఇంటిలోనే ఉండటంతో ఒకానొక సమయంలో పట్టణాలకే పరిమితమైన ఓటిటి ఇప్పుడు గ్రామాల్లో కూడా అలవాటు అయిపోయింది.

 

చాలామంది సినిమాలు సీరియల్స్ ఓటిటి ద్వారా వీక్షిస్తున్నారు. కాగా ఓటిటి లో అడుగుపెట్టిన అమెజాన్ ప్రేక్షకులు ఎంతగానో ఎప్పటినుండో అలరిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ రావడంతో అమెజాన్ ప్రైమ్ లో ఐదు తెలుగు సినిమాలు దుమ్మురేపుతున్నాయి. వాటి వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మత్తు వదలరా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఘర్షణ, అతడు, రంగస్థలం. ఈ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్ ఓటిటి ద్వారా  ప్రేక్షకులు బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 

 

మత్తు వదలరా:

 

ఆన్‌లైన్‌ షాపింగ్‌ జమానాలో డెలివరీ బాయ్‌లు ఎలాంటి చిన్న చిన్న మోసాలకి పాల్పడతారు, ఒకసారి కక్కుర్తి పడితే వాళ్లెలాంటి కష్టాలు ఎదుర్కొంటారు అనే బ్యాక్‌డ్రాప్‌లో సిటీలో జరిగే ఇల్లీగల్‌ డ్రగ్స్‌ దందాకి ముడిపెట్టి అద్భుతంగా డైరెక్టర్ తెరకెక్కించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు బాగా వీక్షిస్తున్నారు.

 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి) నెల్లూరులో ఒక చిన్న డిటెక్టివ్ ఏజెంట్. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా స్నేహ (శృతి శ‌ర్మ) పనిచేస్తుంది. రోజూ చిన్న చిన్న కేసులు చూసే వీళ్లు ఒక పెద్ద క్రైమ్ కేసులో ఇరుక్కుపోతారు. ఒక శవాన్ని చూద్దామని వెళ్లి మర్డర్ కేసులో ఇరుక్కుపోయి...అటువంటి పరిస్థితి నుండి ఏవిధంగా బయట పడ్డారు అన్నది సినిమా స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా మరో పక్క కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమాని ప్రస్తుతం ప్రేక్షకులు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

 

 

ఘర్షణ:

 

ప్రముఖ డైరెక్టర్ కోదండ శక త్వరలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. సినిమాలో సాంగ్స్ మరియు వెంకటేష్ నటన హైలెట్ అవటంతో ప్రస్తుతం ఈ సినిమాను ఎక్కువగా చూస్తున్నారు. దాదాపు సినిమా రిలీజ్ అయ్యే 15 సంవత్సరాలు దాటిపోయినా గాని అమెజాన్ ప్రైమ్ లో టాప్ పొజిషన్ లో సినిమా ఉంది. 

 

అతడు:

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ కూడా టెలివిజన్ రేటింగ్స్ లో అద్భుతాలు సృష్టిస్తోంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాని బాగా చూస్తున్నారు. మహేష్ సైలెంట్ యాక్టింగ్ కి త్రివిక్రమ్ టేకింగ్, టైమింగ్ తో అప్పట్లో రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది.

 

రంగస్థలం:

 

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా 2018 లో రిలీజ్ అయ్యి సంక్రాంతి పండుగకు సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది. సినిమాలో రామ్ చరణ్ నటనకు చాలామంది అప్పట్లో షాక్ తిన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మెచ్యూరిటీ లెవెల్ నటన ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమాని కూడా బాగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: