కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ రావడంతో  సినీ  సెలబ్రెటీలకు కూడా ఇంటి పట్టున ఉండడం తప్పడం లేదు. అయితే యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి  ఈ క్వాంరటైన్ టైం లో బి ద రియల్ మ్యాన్ పేరిట ఓ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టాడు. దీని ఉద్దేశం ఏంటంటే...  ఇంటి పనుల విషయంలో భార్యలకు సహాయం చేసి వారి పనులను పంచుకోవడం. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇప్పటికే  ఈ ఛాలెంజ్ ను రాజమౌళి ,ఎన్టీఆర్ ,రామ్ చరణ్ వంటి స్టార్లు  పూర్తి చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
ఇక  నిన్న ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ , నాగార్జున , బాలకృష్ణ , కొరటాల శివ లను ఈ ఛాలెంజ్ కోసం నామినెట్ చేశాడు. వీరిలో కొరటాల శివ ఛాలెంజ్ ను పూర్తి చేయగా తాజాగా వెంకటేష్ ఛాలెంజ్ ను యాక్సెప్ట్  చేశాడు అలాగే  చిరంజీవి వీడియో కోసం ఎదురుచూస్తున్నట్లు వెంకీ  ట్వీట్ చేశాడు. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణ  ఈ ఛాలెంజ్ ను  పూర్తి చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
 ఇదిలావుంటే వెంకటేష్ ప్రస్తుతం నారప్ప లో నటిస్తున్నాడు. సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ అసురన్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సగానికిపైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండగా సురేష్ బాబు ,ఎస్ తాను నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: