కరోనా వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇక వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఉన్న ఏకైక మార్గం ఎవరి ఇంట్లో వారు అప్రమత్తంగా ఉంటూ బయటకు రాకుండా వైరస్ కనుసన్నుల్లో తిరగకుండా ఉండడమే. అది తప్పించి మన చేతుల్లో మరేమీ లేదని కుండబద్దలు కొట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెలవివ్వడం కూడా మనం చూశాం. ఇకపోతే పెరుగుతున్న కేసుల దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగించిన కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ నిబంధనలను కాస్త సడలిస్తూ మార్గదర్శకాలు రూపొందించిన విషయం కూడా తెలిసిందే.

 

ఇక కేసిఆర్.... కేంద్రం తీసుకువచ్చిన లాక్ డౌన్లోడ్ మార్గదర్శకాలను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పినప్పుడు అంతా కొద్దిగా అతని నిర్ణయం పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు అతని నిర్ణయం సరైనది అనిపిస్తోంది. లాక్ డౌన్ సడలింపు నిర్ణయాన్ని అమలు చేసిన కేరళ రాష్ట్రంలో ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిన వైనం ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేసింది. వెంటనే అలర్ట్ అయిన కేరళ రాష్ట్ర సర్కారు చివరికి సడలింపులను తీసేస్తూ ముందటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితిని తెలియజేస్తోంది.

 

ఇప్పటివరకు మనదేశంలో కరోనా వైరస్ కేసులు మొదట కేరళలో చాలా ఎక్కువగా వచ్చినప్పటికీ చాలా త్వరగా వాటిని నియంత్రించడంలో సక్సెస్ అయిందని మంచి పేరు సంపాదించిన కేరళ రాష్ట్రం పై గత కొద్ది వారాలుగా సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. అయితే వెంటనే వీరు లాక్ డౌన్ నిబంధనలను సడలింస్తూ వహించిన నిర్లక్ష్యం వల్ల మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

కేరళ ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చేశారు. దీంతో.. మంగళవారం ఒక్కరోజులోనే కేరళలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కన్నూరులోనే పది కేసులు నమోదు కావటం గమనార్హం. కేరళలో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగటానికి కారణం లాక్ డౌన్ ను సడలిస్తూ తీసుకున్న నిర్ణయమేనని భావిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తేనే ఇలా ఉంటే ఇక నేరుగా ఎత్తేస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోండి. కాబట్టి జూన్ వరకు అలాంటి ఆశలు పెట్టుకోకపోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: